పారా ఆర్చరీని దాటి ప్రధాన జట్టులోకి... | Sheetal Devi is ready to show her mettle in the open archery competitions | Sakshi
Sakshi News home page

పారా ఆర్చరీని దాటి ప్రధాన జట్టులోకి...

Nov 7 2025 4:55 AM | Updated on Nov 7 2025 4:56 AM

Sheetal Devi is ready to show her mettle in the open archery competitions

భారత జూనియర్‌ ఆర్చరీ టీమ్‌లో శీతల్‌ దేవి   

న్యూఢిల్లీ: రెండు చేతులు లేకుండానే బరిలోకి దిగి పారా ఆర్చరీలో సంచలన విజయాలు సాధించిన శీతల్‌ దేవి ఇప్పుడు ఓపెన్‌ ఆర్చరీ (ఏబుల్డ్‌) పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. 2024 పారాలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ కాంపౌండ్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన శీతల్‌... భారత జూనియర్‌ జట్టులోకి ఎంపికైంది. సౌదీ అరేబియాలోని జిద్దాలో జరిగే ఆసియా కప్‌ స్టేజ్‌–3 టోర్నీలో భారత జట్టు పోటీ పడనుంది.

సోనీపథ్‌లో నాలుగు రోజుల పాటు 60 మంది పోటీ పడిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొని శీతల్‌ క్వాలిఫై కావడం విశేషం. ‘నేను ఆర్చరీ మొదలు పెట్టినప్పుడు ఏదో ఒక రోజు అందరిలాగే ఓపెన్‌ (ఏబుల్డ్‌) పోటీల్లో పాల్గొనాలని కలలుగన్నా. గతంలో ప్రయత్నించినా ఇది సాధ్యం కాలేదు. కానీ లోపాలు సరిదిద్దుకుంటూ మళ్లీ మళ్లీ ప్రయత్నించాను. 

ఇప్పుడు ఇలా అవకాశం దక్కింది’ అని శీతల్‌ వ్యాఖ్యానించింది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జూనియర్‌ జట్టులో మహిళల రికర్వ్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండపావులూరి యుక్తశ్రీ కూడా ఎంపికైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement