సాక్షి, అమరావతి: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టుకు ఎంపికైన పారా ఆర్చర్ శీతల్‌దేవికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ‘శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.
ఓపెన్ ఆర్చరీ(ఏబుల్–బాడీడ్) అంతర్జాతీయ ఈవెంట్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ పారా ఆర్చర్‌గా నిలిచిన శీతల్‌కు అభినందనలు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాదించవచ్చని శీతల్ నిరూపించింది. ఆసియాకప్‌లో పాల్గొననున్న శీతల్‌కి ఆల్ ది బెస్ట్’ అంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.


