breaking news
India archery
-
పారా ఆర్చరీని దాటి ప్రధాన జట్టులోకి...
న్యూఢిల్లీ: రెండు చేతులు లేకుండానే బరిలోకి దిగి పారా ఆర్చరీలో సంచలన విజయాలు సాధించిన శీతల్ దేవి ఇప్పుడు ఓపెన్ ఆర్చరీ (ఏబుల్డ్) పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. 2024 పారాలింపిక్స్‌లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్యం సాధించిన శీతల్... భారత జూనియర్ జట్టులోకి ఎంపికైంది. సౌదీ అరేబియాలోని జిద్దాలో జరిగే ఆసియా కప్ స్టేజ్–3 టోర్నీలో భారత జట్టు పోటీ పడనుంది.సోనీపథ్లో నాలుగు రోజుల పాటు 60 మంది పోటీ పడిన సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొని శీతల్ క్వాలిఫై కావడం విశేషం. ‘నేను ఆర్చరీ మొదలు పెట్టినప్పుడు ఏదో ఒక రోజు అందరిలాగే ఓపెన్ (ఏబుల్డ్) పోటీల్లో పాల్గొనాలని కలలుగన్నా. గతంలో ప్రయత్నించినా ఇది సాధ్యం కాలేదు. కానీ లోపాలు సరిదిద్దుకుంటూ మళ్లీ మళ్లీ ప్రయత్నించాను. ఇప్పుడు ఇలా అవకాశం దక్కింది’ అని శీతల్ వ్యాఖ్యానించింది. ఈ టోర్నీ కోసం ప్రకటించిన భారత జూనియర్ జట్టులో మహిళల రికర్వ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండపావులూరి యుక్తశ్రీ కూడా ఎంపికైంది. -
'బొంబేలా' బాణం దూసుకెళ్లింది
భారత మహిళా ఆర్చర్ బొంబేలా దేవి ముందంజ వేసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ప్రీక్వార్టర్స్ కు దూసుకెళ్లింది. రియో ఒలింపిక్స్ లో భాగంగా బుధవారం సాయంత్రం జరిగిన రౌండ్ 64లో ఆస్ట్రేలియాకు చెందిన లారెన్స్ బాల్డఫ్ పై నెగ్గింది. అనంతరం చైనీస్ తైపీకి చెందిన లిన్ షి చియాను రౌండ్-32 లో 6-2 తేడాతో ఓడించి రౌండ్-16కు దూసుకెళ్లింది. చియాపై తొలి రెండు సెట్లు కైవసం చేసుకున్న బొంబేలా దేవి మూడో సెట్ ప్రత్యర్ధికి కోల్పోయి కాస్త వెనుకంజ వేసినా వెంటనే పుంజుకుని నాలుగో రౌండ్లో మెరుగైన స్కోరు సాధించి విజయాన్ని నమోదు చేసింది.


