
PC: X
భారత పారా ఆర్చర్ శీతల్ దేవి (Sheetal Devi) సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్ (Para World Archery Championship)లో భాగంగా మహిళల వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో సంచలన విజయం సాధించింది. వరల్డ్ నంబర్ వన్, టర్కీకి చెందిన ఓజ్‌నుర్ క్యూర్ గిర్డీని 146- 143 తేడాతో ఓడించి స్వర్ణ పతకం (Won Gold Medal) కైవసం చేసుకుంది.
పద్దెమినిదేళ్ల వయసులోనే
దక్షిణ కొరియాలోని గ్వాన్‌జూ వేదికగా శనివారం జరిగిన పోటీలో ఈ మేరకు శీతల్ దేవి పసిడి గెలిచింది. తద్వారా ఈ చాంపియన్‌షిప్‌లో చేతుల్లేకుండానే ఈ ఘనత సాధించిన ఆర్చర్‌గా ఆమె చరిత్రకెక్కింది. అంతేకాదు పద్దెమినిదేళ్ల వయసులోనే శీతల్ ఈ ఘనత సాధించడం విశేషం.
అంతకు ముందు.. తోమన్ కుమార్‌తో కలిసి ఇదే ఈవెంట్లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి కాంస్యం గెలుచుకుంది. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోడీ గ్రిన్హామ్- నాథన్ మాక్‌క్వీన్‌ను 152- 149తో ఓడించి ఈ పతకం సాధించింది శీతల్- తోమన్ జోడీ.
అదే విధంగా.. మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్లో శీతల్ దేవి సరితతో కలిసి రజత పతకం సాధించింది. ఫైనల్లో టర్కీ పారా ఆర్చర్ల చేతిలో ఓడిపోవడం ద్వారా వీరు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
రెండు చేతులు లేకుండానే
జమ్ము కశ్మీర్‌కు చెందిన శీతల్ దేవి పుట్టడమే ‘ఫొలొమెలియా’ అనే శారీరక స్థితి వల్ల రెండు చేతులు లేకుండానే జన్మించింది. అయినా విధివంచితురాలినని కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కాళ్లను, భుజాలను, పంటి దవడలను ఉపయోగించి బాణం ప్రయోగించడం నేర్చుకుంది.

అంచెలంచెలుగా ఎదిగి 2024లో పారిస్ పారా ఒలింపిక్స్‌లో పతకం గెలిచింది. సాధారణంగా విలు విద్య అంటేనే చేతులతో ప్రదర్శించేది. అలాంటిది చేతులే లేకుండా శీతల్ వేది బాణం వేయడం విశేషం. ఇప్పటికే ఎన్నో పతకాలు గెలుచుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా వరల్డ్ చాంపియన్ అయింది.
చదవండి: IND vs WI: ‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్‌పై వేటు’