ప్రతిభకు పురస్కారం | Para Athlete Sheetal Devi Wins World Archery Para Archer of the Year | Sakshi
Sakshi News home page

Sheetal Devi: ప్రతిభకు పురస్కారం

Mar 31 2026 10:22 AM | Updated on Mar 31 2026 10:33 AM

Para Athlete Sheetal Devi Wins World Archery Para Archer of the Year

ప్రపంచ ఉత్తమ పారా ఆర్చర్‌గా శీతల్‌ దేవి ఎంపిక

లుసానే: భారత మహిళా పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి ప్రతిభకు ప్రపంచ పురస్కారం దక్కింది. భుజాల నుంచే రెండు చేతులు లేని ఈ కశీ్మరి ఆర్చర్‌ అంతర్జాతీయ పారా క్రీడల్లో సత్తాచాటుతోంది. దీంతో 2025 ఏడాదికి సంబంధించి ప్రపంచ ఆర్చరీ ప్రకటించిన ‘పారా ఆర్చర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు శీతల్‌ దేవికి దక్కింది. 

గతేడాది గ్వాంగ్జూ (దక్షిణ కొరియా)లో జరిగిన ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆమె అసాధారణ ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. ఇందులో బరిలోకి దిగిన ఆమె అసలు చేతులే లేని ఏకైక మహిళా ఆర్చర్‌... వ్యక్తిగత కాంపౌండ్‌ ఈవెంట్‌లో చేతులుండి వైకల్యమున్న ప్రపంచ స్థాయి పారా ఆర్చర్లను ఢీకొట్టి మరీ విజేతగా నిలిచింది. 

తన కాలి వేళ్లు, భుజం సాయంతో విల్లును లక్ష్య బిందువుపై ఎక్కుపెట్టే ప్రతిభ చూపరుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒకసారి ఆమె పోటీ మొదలైతే ప్రేక్షకులెవరూ కనులు తిప్పుకోనివ్వని నైపుణ్యం ఆమె సొంతం. ఈ నైపుణ్యంతోనే అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల్ని సాధిస్తున్న శీతల్‌కు వార్షిక అవార్డుల రేసులో ప్రపంచ ఆర్చరీ పట్టం కట్టింది. ‘పారా ఆర్చర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఎంపిక చేసింది. 

కొరియాలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఆమె కేవలం ఒక స్వర్ణంతోనే సరిపెట్టుకోలేదు... మహిళల టీమ్‌ ఈవెంట్‌లో రజతం, మిక్స్‌డ్‌ టీమ్‌లో కాంస్యం సాధించింది. ప్రపంచ ఆర్చరీ అవార్డులకు నామినేట్‌ కావడం ఇప్పుడు పురస్కారానికి ఎంపికవడం చాలా సంతోషాన్ని
చి్చందని, వ్యక్తిగతంగా ఈ అవార్డు తన గుండెను తాకిందని శీతల్‌ దేవి భావోద్వేగంతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లోనూ ఈ కశ్మీరీ ఆర్చర్‌ సత్తా చాటుకుంది. ఆమె మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గింది. 2022 పారా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత ఈవెంట్‌లో రజతం, 2023 ఆసియా చాంపియన్‌íÙప్‌లో రజతం గెలుచుకుంది. ప్రపంచ ఆర్చరీలో ఈ తరహా అవార్డుల్ని 2011లో ప్రారంభించారు. అసాధారణ నైపుణ్యం కనబరిచిన ఆర్చర్లు, పారా ఆర్చర్ల ఘనతను గుర్తించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం.    

చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement