జింబాబ్వేపై సిరీస్ విజయం.. అసంతృప్తితో రగిలిన మంధాన! | Smriti-Mandhana Dissoppoints-Poor-Fielding-Need-Improve-Vs ZIM 2nd T20I | Sakshi
Sakshi News home page

జింబాబ్వేపై సిరీస్ విజయం.. అసంతృప్తితో రగిలిన మంధాన!

Oct 19 2026 10:12 AM | Updated on Oct 19 2026 10:47 AM

Smriti-Mandhana Dissoppoints-Poor-Fielding-Need-Improve-Vs ZIM 2nd T20I

Photo Credit: BCCI Twitter

జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత మహిళల జట్టు 2-0తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే జింబాబ్వే సిరీస్ విజయం సాధించినప్పటికీ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్ అనంతరం స్మృతి మాట్లాడుతూ.. ‘‘తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. 

వ్యూహాత్మకంగా వ్యవహరించి జింబాబ్వేను తక్కువ స్కోరుకే కట్టడి చేశాం. సిరీస్ విజయం సాధించినప్పటికీ, చాలా విషయాల్లో మేం మెరుగుపడాల్సిన అవసరముంది. ముఖ్యంగా ఫీల్డింగ్ విషయంలో తప్పిదాలు చేశాము. క్యాచ్‌లను వదిలేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని, మా ఫీల్డర్లు సులువైన క్యాచ్‌లు కూడా జారవిడిచారు. దీనిని సరిదిద్దుకోవాలి. 

పవర్‌ప్లేలో షఫాలీ తనదైన శైలిలో బాదుతున్న తీరు చూసి, ఆమెకు సింగిల్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా వాటిని సద్వినియోగం చేసుకున్నా’ అని చెప్పుకొచ్చింది.

మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. చిపో ముగెరి (34), జోస్‌ఫినె కోమో (27) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నిక్కీ ప్రసాద్ రెండు వికెట్లు తీయగా, దీప్తిశర్మ, క్రాంతి గౌడ్‌, నందనీ శర్మ, శ్రీ చరణి తలా ఒక వికెట్ పడగొట్టారు. 

అనంతరం ఛేదనలో భారత్‌ 8.5 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 104 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షఫాలీ వర్మ (25 బంతుల్లో 55) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించగా, స్మృతి మంధాన (25 బంతుల్లో 47 నాటౌట్‌) యాంకర్ రోల్ పోషించి జట్టును గెలిపించింది. ఇరుజట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ రేపు జరగనుంది.

 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement