వేదిక మారింది.. డిసెంబ‌ర్ 16న ఐపీఎల్ మినీ వేలం! | Goa Likely-To-Host-IPL 2027 Mini-Auction Date Announced | Sakshi
Sakshi News home page

IPL 2027: వేదిక మారింది.. డిసెంబ‌ర్ 16న ఐపీఎల్ మినీ వేలం!

Oct 19 2026 9:06 AM | Updated on Oct 19 2026 9:12 AM

Goa Likely-To-Host-IPL 2027 Mini-Auction Date Announced

Photo Credit: Twitter

ఐపీఎల్ 2027 సీజ‌న్ ప్రారంభానికి ముందు జ‌ర‌గ‌బోయే మినీ వేలం తేదీని బీసీసీఐ ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 16న గోవా వేదిక‌గా మినీ వేలం నిర్వ‌హించ‌నున్న‌ట్లు బీసీసీఐ ఇప్ప‌టికే అన్ని ఫ్రాంచైజీల‌కు స‌మాచారం అందించింది. వేలానికి ఒక‌రోజు ముందుగా డిసెంబ‌ర్ 15న ఫ్రాంచైజీల యాజ‌మానులు, ప్ర‌తినిధుల‌తో ముఖ్య స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. 

ఇక న‌వంబ‌ర్ 15 నాటికి జ‌ట్లు త‌మ ఆట‌గాళ్ల రిటెన్ష‌న్ జాబితాను బీసీసీఐకి సమ‌ర్పించాల్సి ఉంటుంది. గ‌డిచిన మూడు సీజ‌న్లుగా ఐపీఎల్ వేలం విదేశాల్లోనే జ‌రిగింది. కానీ ఈసారి మాత్రం వేలం భార‌త్‌లో జ‌ర‌గ‌నుండ‌డం ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది. కాగా ఐపీఎల్ వేలం తేదీ రోజునే బెంగళూరులో శ్రీలంకతో టీమిండియా వన్డే మ్యాచ్ ఆడాల్సి ఉంది. 

అదే రోజున ఐపీఎల్ వేలం నిర్వహిస్తే, ఆటగాళ్లు, జట్టు యాజమాన్యాలు, ఇతర సంబంధిత వర్గాల ప్రణాళికలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో వేలం తేదీలో మార్పు ఉంటుందా? లేదా వన్డే మ్యాచ్ షెడ్యూల్‌లో ఏదైనా మార్పు చేస్తారా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. వేలం తేదీ, వేదికపై బీసీసీఐ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement