Photo Credit: Twitter
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ ఎలైట్ గ్రూప్-బిలో సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటయ్యింది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మన్వంత్ కుమార్ (214 బంతుల్లో 135; 11 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో కర్నాటక ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 194 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్నాటకను మన్వంత్ కుమార్ గట్టెక్కించాడు.
తొమ్మిదో వికెట్‌కు అభిలాష్ షెట్టి (14)తో కలిసి రికార్డు స్థాయిలో 146 పరుగులు జోడించడం విశేషం. ఇందులో మన్వంత్ కుమార్ ఒక్కడే 128 పరుగులు సాధించాడు. ఒక ఎండ్‌లో అభిలాష్‌ను నిలబెట్టి స్ట్రైక్ మొత్తం తానే తీసుకున్న మన్వంత్ రంజీ చరిత్రలోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడనంలో సందేహం లేదు. కాగా 22 ఏళ్ల మన్వంత్‌కు ఇదే తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ కావడం విశేషం.
సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భుట్ ఐదు వికెట్లతో చెలరేగగా, కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ మూడు, చేతన్ సకారియా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్లు హార్విక్ దేశాయ్ (41), హెత్విక్ కొటక్ (16) క్రీజులో ఉన్నారు. సౌరాష్ట్ర ఇంకా 285 పరుగులు వెనుకబడి ఉంది.
- Ranji Trophy - Karnataka 194/8 - Coming to bat at Number 9 - 22 years old, 2nd match in FC Manvanth Kumar smashed an iconic 135 runs, A fast bowling all rounder from Karnataka to look forward to the future. 🇮🇳 IPL teams can look for him in the upcoming auction. https://t.co/5k25xeMQFU
— Johns. (@CricCrazyJohns) October 19, 2026
Manvanth Kumar’s six-hitting masterclass! 🔥 Came in at No. 8 and smashed an unbeaten 86 with 5 sixes, crucial 87-run partnership for the 9th wicket. And that SIX off Undakat… ABSOLUTELY CRAZY #KARvSAU #ManvanthKumar @Vinay_Kumar_R https://t.co/LqB7hocutp
— KA 36 (@KA36_P001) October 18, 2026
ఇదీ చదవండి:


