‘త్వరలోనే టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేస్తా’ | I feel I will make my Test debut very soon: India Young Star Ahead IND vs NZ | Sakshi
Sakshi News home page

‘త్వరలోనే టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేస్తా’

Oct 11 2026 3:42 PM | Updated on Oct 11 2026 3:44 PM

I feel I will make my Test debut very soon: India Young Star Ahead IND vs NZ

PC: BCCI/Instagram

స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ముగించుకున్న తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. కివీస్‌ గడ్డ మీద అక్టోబరు 22- డిసెంబరు 1 మధ్య ఐదు టీ20లు, రెండు టెస్టులు, ఐదు వన్డేలు ఆడనుంది.

త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం
ఈ నేపథ్యంలో టీమిండియా యువ క్రికెటర్‌ హర్ష్‌ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల హర్ష్‌ దూబే బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన అతడు.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున సత్తా చాటాడు.

ఏకంగా 69 వికెట్లు
ఇక 2024-25 రంజీ సీజన్లో హర్ష్‌ దూబే పది మ్యాచ్‌లు ఆడి ఏకంగా 69 వికెట్లు పడగొట్టాడు. తద్వారా సీజన్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఊహించని విధంగా ఈ ఏడాది జూన్‌లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన సిరీస్‌ సందర్భంగా వన్డే క్యాప్‌ అందుకున్న హర్ష్‌ దూబే.. రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఈ నేపథ్యంలో కివీస్‌ పర్యటన నేపథ్యంలో హర్ష్‌ దూబే టెస్టుల్లోనూ తాను త్వరలోనే అరంగేట్రం చేస్తానని వ్యాఖ్యానించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే నేను టీమిండియా తరఫున టెస్టుల్లోనూ అడుగుపెడతాను. దీనిని నా ఊహ అనుకుంటారో.. లేదంటే నా గట్టినమ్మకం అనుకుంటారో.. దానికి ఏ పేరు పెట్టినా మీ ఇష్టం.

కచ్చితంగా అరంగేట్రం చేస్తాను
నేను మాత్రం కచ్చితంగా అరంగేట్రం చేస్తాను. అయితే, ఇది జరిగేంత వరకు మనం ఏదీ బయటకు చెప్పకూడదు. ఒక్కోసారి జీవితంలో అన్నీ అకస్మాత్తుగానే జరిగిపోతాయి. నాకు టెస్టుల్లో ఎప్పుడు అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాను’’ అని హర్ష్‌ దూబే చెప్పుకొచ్చాడు. కాగా విదర్భ ఆల్‌రౌండర్‌ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌తో బిజీగా ఉన్నాడు.

చదవండి: నా కెరీర్‌లో అత్యంత కఠిన దశ అదే: రోహిత్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement