వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ అనంతరం రంజీ ట్రోఫీ 2026-27లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ ఐదు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి అజయ్ మండల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ ఆది నుంచే ఇబ్బందిగా కనిపించాడు. స్పిన్నర్ మండల్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా, అది మిస్సయ్యి గిల్ ప్యాడ్స్ సందుల్లో నుంచి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
ఇటీవలి కాలంలో స్పిన్ బౌలింగ్ ఆడడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న గిల్ తాజాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ దానిని రిపీట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఔటైనప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అవకాశమొస్తే మాత్రం రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. విండీస్‌తో సిరీస్ అనంతరం న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది.
అయితే మొదట టీ20 సిరీస్ ఆడనుండడంతో వన్డే, టెస్టుల్లో మాత్రమే ఆడుతున్న గిల్‌కు కివీస్‌కు వెళ్లేందుకు సమయం ఉండడంతో మరో మ్యాచ్ ఆడే అవకాశముంది. ఇక వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో గిల్ బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. మూడు వన్డేలాడిన గిల్ 334 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మరో డబుల్ సెంచరీ ఉంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 40 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. కెప్టెన్ ఉదయ్ సహరన్ (36), ప్రబ్‌సిమ్రన్ సింగ్ (10) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ విహాన్ మల్హోత్రా (40) రాణించాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో అజయ్ మండల్ రెండు వికెట్లు తీయగా, ధర్మేందర సిన్హా జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.
In the Ranji Trophy, Shubman Gill was bowled after scoring 1 run. https://t.co/f9JgFnW2W5
— Mamta Jaipal (@ImMD45) October 18, 2026
ఇదీ చదవండి: ‘అతడి కోసం త్యాగం తప్ప నాకు మరో మార్గం లేదు’


