యువతిని వేధిస్తున్న టీడీపీ యువ నాయకుడు | Woman Journalist Alleges Attack on Her House in Sri Kalahasti | Sakshi
Sakshi News home page

యువతిని వేధిస్తున్న టీడీపీ యువ నాయకుడు

Sep 21 2026 11:06 AM | Updated on Sep 21 2026 11:29 AM

Woman Journalist Alleges Attack on Her House in Sri Kalahasti

ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డితో సురేష్‌ (ఫైల్‌)

తిరుపతి:  మండలంలోని పొయ్యకొత్తూరుకు చెందిన టీడీపీ యువ నాయకుడు సురేష్‌ వేధింపులు ఎక్కువయ్యాయి. పట్టణంలోని సాలిపేటకు చెందిన ఓ యువతి వద్ద అతను ఏడాది క్రితం కుక్కపిల్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపేందుకు యువతి సెల్‌ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడని, ఆ తర్వాత నుంచి ఫోన్‌ చేస్తూ వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. 

ఈ విషయాన్ని ఆమె బీవైసీ పార్టీ రాష్ట్ర మహిళా కో కనీ్వనర్‌ హిమబిందు దృష్టికి తీసుకెళ్లింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సురేష్‌పై శ్రీకాళహస్తి టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైనప్పటికీ బెదిరింపులు ఆగలేదని, మహిళకు జరిగిన అన్యాయంపై సామాజిక బాధ్యతతో అండగా నిలిచినందుకు తనపై కూడా దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాడని హిమబిందు ఆరోపించారు.   

ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేసినా..! 
ఈ నేపథ్యంలో గత గురువారం హిమబిందుతో కలిసి మహిళలు పొయ్యకొత్తూరులోని సురేష్‌ ఇంటికి వెళ్లారు. అతని వేధింపులపై కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సురేష్‌ హిమబిందు ఇంటికి వెళ్లి విధ్వంసానికి పాల్పడ్డాడు. పొయ్యకొత్తూరు నుంచి వస్తున్న ఇద్దరు మహిళలను అడ్డుకుని వారిపై దాడికి యత్నించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన సురేష్‌ తాను టీడీపీ నాయకుడినని, ఎమ్మెల్యే తనకు తెలుసంటూ హంగామా చేశాడని, ‘మీ అంతు చూస్తానంటూ’ పోలీసులను సైతం బెదిరించినట్లు బాధితులు ఆరోపించారు. కొందరు టీడీపీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి సురేష్‌కు మద్దతుగా మాట్లాడినట్లు సమాచారం. మహిళలు రాజీకి అంగీకరించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. 

ఆగని బెదిరింపులు 
ఇప్పటికే కేసు నమోదైనా బెదిరింపులు ఆగలేదని హిమబిందు ఆరోపించారు. ఓ మహిళకు అండగా నిలిచినందుకు తనపై దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయగా.. మరుసటి రోజు అయిన ఆదివారం ఉదయానికే సురేష్‌ తన ఇంటి వద్దకు వచ్చి అక్కడ నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం అద్దాలు, లైట్లు ధ్వంసం చేసి ఇబ్బందులకు గురిచేశాడని హిమబిందు ఆరోపించారు.  

అండగా నిలిస్తే చంపేస్తారా? 
ఈ ఘటనపై హిమబిందు సోషల్‌ మీడియా వేదికగా ఆదివారం తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘సామాజిక బాధ్యతతో ఓ మహిళకు అండగా నిలిస్తే చంపేస్తామని బెదిరిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే పేరును ప్రస్తావిస్తూ.. టీడీపీ యువ నాయకులు మహిళలకు చేస్తున్న అన్యాయాలు, తన∙పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలు ఆయనకు తెలియవా?.. లేక వారికి నిజంగానే ఎమ్మెల్యేయ అండదండలు ఉన్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మహిళలను కాపాడాలని, తనకు జరిగిన పరిణామాలపై కూడా స్పందించి న్యాయం చేయాలని హిమబిందు కోరారు. హిమబిందు సోషల్‌ మీడియాలో చేసిన పోస్టుపై పోలీసులు స్పందించినట్లు సమాచారం. సురేష్‌ పై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి  అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి 13 రోజుల రిమాండ్‌కు తరలించారు.

యువతిని వేధిస్తున్న 
టీడీపీ యువ నాయకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement