టీడీపీ గూండాలతో పోలీసులు కుమ్మక్కు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి | TDP Leaders And Police Over Action At Vijayawada SAAP Office | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాలతో పోలీసులు కుమ్మక్కు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి

Sep 21 2026 11:04 AM | Updated on Sep 21 2026 1:22 PM

TDP Leaders And Police Over Action At Vijayawada SAAP Office

సాక్షి, విజయవాడ: డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై సీబీఐ విచారణ జరపాలంటూ విజయవాడలో వైఎస్సార్‌సీపీ నిరసన చేపట్టంది.  శాప్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధం కాగా.. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. ఇదే సమయంలో శాప్‌ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి.. భౌతిక దాడులకు పాల్పడారు.

టీచర్ల ముసుగులో టీడీపీ అనుబంధ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు, టీడీపీ కార్యకర్తలు శాప్‌ ఆఫీసు వద్దకు వచ్చారు. అనంతరం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు.వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రక్తం వచ్చేలా టీడీపీ గూండాలు దాడులు చేశారు. విద్యార్థి విభాగం నేతలను కర్రలతో కొట్టారు. పోలీసుల ముసుగులో లాఠీలతో దాడులకు తెగబడ్డారు. కాగా, టీడీపీ గూండాలతో పోలీసులు కుమ్మక్కవడం గమనార్హం. విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు విడ్డూరం చూస్తూ నిల్చున్నారు. బారికేడ్లు పెట్టి వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకుంటున్నారు.

మరోవైపు.. శాప్‌ కార్యాలయానికి ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు చేరుకున్నారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు.. వైఎస్సార్‌సీపీ శాంతియుత నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఎందుకు? టీడీపీ, జనసేనకు వర్తించదా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement