breaking news
saap board
-
జ్యోతి సురేఖకు అపూర్వ స్వాగతం పలికిన శాఫ్ ప్రతినిధులు
సాక్షి, విజయవాడ: హాంగ్ఝౌ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్ 2023లో ఆంధ్రప్రదేశ్ (విజయవాడ) అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం భారత బృందంతో పాటు ప్రధాని మోదీని కలిసిన జ్యోతి సురేఖ.. ఇవాళ సొంత నగరం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా శాప్ ప్రతినిధులు, స్థానిక విద్యార్థులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. శాప్ ప్రతినిధులు, విద్యార్థులు జ్యోతి సురేఖను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగానని తెలిపారు. ఒలంపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీ లేకపోవడం బ్యాక్ డ్రాప్ అయినా పట్టించుకోనని పేర్కొన్నారు. భవిష్యత్ గోల్స్ రీచ్ అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తనను అన్ని విధాల సపోర్ట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జ్యోతి సురేఖ వెన్నం 2023 ఏషియన్ గేమ్స్ కాంపౌండ్ ఆర్చరీలో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్‌లో మూడు స్వర్ణాలు సాధించింది. -
డీఎస్ఏ విచారణకు బ్రేక్
కడప స్పోర్ట్స్: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో గురువారం విచారణ పర్వానికి బ్రేక్ పడింది. డీఎస్‌ఏలో గత నెల 5న అవుట్డోర్ క్రీడామైదానంలోని స్టోర్ గది తాళాలు పగులగొట్టిన సంఘటన నేపథ్యంలో శాప్ బోర్డు సభ్యుడు, డీఎస్ఏ అధికారులు ఒకరిపై ఒకరు కేసులు నమోదు వరకు వ్యవహారం వెళ్లింది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో శాప్ ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర సమాచారం కోసం విచారణాధికారిని నియమించారు. దీంతో గురువారం విచారణాధికారిగా శాప్ నుంచి గిరిజన క్రీడాఅధికారి దేవానంద్ కడపకు విచ్చేశారు. ఉదయాన్నే క్రీడామైదానానికి చేరుకున్న ఆయన డీఎస్‌ఏలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియంలను పరిశీలించారు. బాత్రూంలు, డార్మిటరీ గదులను పరిశీలించి సెల్‌ఫోన్ ద్వారా వివరాలను రికార్డు చేసుకున్నారు. అనంతరం డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ, శాప్ డైరెక్టర్ జయచంద్ర, డీఎస్ఏ సిబ్బందితో మాట్లాడారు. కలెక్టర్ సూచనతో వెనక్కి...! డీఎస్ఏ ఘటనపై విచారణ చేపట్టేందుకు వచ్చిన విచారణాధికారి దేవానంద్, డీఎస్డీఓ ఎం.లక్ష్మినారాయణశర్మతో కలిసి జిల్లా కలెక్టర్ కె.వి. సత్యనారాయణను కలిశారు. డీఎస్ఏ ఘటనపై విచారణ చేసేందుకు శాప్ అధికారులు పంపారని, విచారణ చేపట్టేందుకు అనుమతించాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ డీఎస్ఏ ఘటనపై ఇప్పటికే కమిటీవేసి విచారణ పూర్తిచేశామని, మళ్లీ విచారణ అక్కరలేదని పేర్కొనడంతో విచారణాధికారి వెనుదిరిగారు. మధ్యాహ్నం డీఎస్‌ఏలో సిబ్బందితో సాధారణంగా సమావేశమై వెనుతిరిగి వెళ్లిపోయారు.