ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ సినిమా | Lechindhi Mahila Lokam Movie OTT Release Date | Sakshi
Sakshi News home page

OTT: మహిళల కోసం తీసిన మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Apr 17 2026 5:33 PM | Updated on Apr 17 2026 6:27 PM

Lechindhi Mahila Lokam Movie OTT Release Date

ఈ వారం బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి. వాటిలో సంభవం అధ్యాయం ఒన్ను, ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, సుయోధన, అస్సీ, సన్నాఫ్ చిత్రాలతో పాటు పోచమ్మ, మట్కా కింగ్ తదితర వెబ్ సిరీస్‌లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇక వచ్చేవారం కూడా మరిన్ని తెలుగు మూవీస్ అందుబాటులోకి రానున్నాయి. అలా ఓ తెలుగు కామెడీ చిత్రం ఓటీటీ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ, శ్రీరామ చంద్ర తదితరులు నటించిన తెలుగు సినిమా 'లేచింది మహిళా లోకం'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇదొకటి రిలీజైన సంగతి కూడా తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడిదే వచ్చే బుధవారం(ఏప్రిల్ 22) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

భార్యభర్తల రిలేషన్, స్త్రీ పురుషుల మధ్య వివక్ష, విడాకులు, కోర్టు కేసులు తదితర ట్రెండీ అంశాలతో ఈ సినిమాని తీశారు. అయితే ఈ సీరియస్ విషయాల్ని కామెడీ, సెటైరికల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కార్తిక్-అర్జున్ దర్శకత్వం వహించారు. పాయింట్ బాగున్నప్పటికీ లాజిక్ లేని సీన్లతో విసిగించారు.

'లేచింది మహిళా లోకం' విషయానికొస్తే.. నలుగురు మహిళలు (మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ) తన  రోజూవారీ జీవితంలో పురుషాధిక్యత వల్ల చిన్న చిన్న అవమానాలు, ఆంక్షలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకానొక టైంలో వీళ్ల జీవితంలో జరిగిన సంఘటనలు, తీవ్రంగా ఆలోచించేలా చేస్తాయి. అప్పటివరకు మౌనంగా భరిస్తూ వచ్చిన వీళ్లు.. అసలు ఇలానే ఎందుకు ఉండాలి? అని తిరగబడతారు. వీరిలోని ఈ మార్పు వల్ల ఇళ్లల్లో భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: పశ్చాత్తాపం లేదు.. విడాకులపై తొలిసారి స్పందించిన హన్సిక)

Advertisement
 
Advertisement
Advertisement