తెలుగులో పలు సినిమాలు చేసిన హీరోయిన్ హన్సిక.. గత నెలలో విడాకులు తీసుకుంది. నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ భర్త సొహెల్ కతురియా నుంచి విడిపోయింది. అధికారికంగా ఈమె ఈ విషయం బయటపెట్టనప్పటికీ.. ముంబై బాంద్రా ఫ్యామిలీ కోర్టులో మార్చి 11న పరస్పర అంగీకారంతో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు తొలిసారి హన్సిక.. విడాకుల గురించి స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న 'వరూధిని పరిణయం' హీరోయిన్)
'ప్రజలకు కావాల్సింది హెడ్ లైన్స్, క్లిక్ బైట్స్. అవి వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ ఏ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇవ్వను కూడా. ఇందులో(విడాకులు తీసుకోవడంలో) నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. మనం తప్పు ట్రైన్ ఎక్కామని తెలిసినప్పుడు అది దిగిపోవడమే మంచిది. ప్రస్తుతం నేను మానసికంగా బాగానే ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంపై ప్రజల అభిప్రాయాల కంటే నా ఆరోగ్యం, శ్రేయస్సే ముఖ్యం. విడాకుల కారణాలు పూర్తిగా వ్యక్తిగతం. అవి మా మధ్యే ఉండాలి. ఈ కష్ట సమయంలో తల్లి, సోదరుడు అండగా నిలిచారు. విడాకులు తర్వాత విశ్రాంతి కోసం జపాన్ వెళ్లొచ్చాను' అని హన్సిక చెప్పుకొచ్చింది.
బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి, టీనేజీలోనే 'దేశముదురు' సినిమాతో హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. ఎక్కువగా తెలుగు, తమిళ సినిమాలు చేసింది. 2022 డిసెంబరులో సొహెల్ కతురియాని పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఈమె వివాహాన్ని.. 'హన్సిక లవ్ షాదీ డ్రామా' పేరిట ఓటీటీలోనూ విడుదల చేశారు. కానీ ఇప్పుడు నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. హన్సిక స్నేహితురాలితోనే తొలుత సొహెల్‌కి వివాహమైంది. ఆమెకి విడాకులిచ్చేసిన తర్వాత హన్సికని పెళ్లాడాడు. కానీ ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు.
(ఇదీ చదవండి: చెల్లి ఆలియా భట్ పెళ్లయిన నాలుగేళ్లకు అక్క ఎంగేజ్‌మెంట్)


