స్టార్ హీరోయిన్ సిస్టర్‌ ఎంగేజ్‌మెంట్‌.. పోస్ట్ వైరల్ | Alia Bhatt sister Shaheen engaged to fitness instructor Ishaan Mehra | Sakshi
Sakshi News home page

Alia Bhatt: ప్రియుడితో ఆలియా భట్ సిస్టర్‌ ఎంగేజ్‌మెంట్‌.. పోస్ట్ వైరల్

Apr 17 2026 4:08 PM | Updated on Apr 17 2026 5:29 PM

Alia Bhatt sister Shaheen engaged to fitness instructor Ishaan Mehra

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తెలుగువారికి సుపరిచితమైన పేరు. ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. చివరిసారిగా జిగ్రా మూవీలో కనిపించిన ఆలియా..  సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న 'లవ్ అండ్ వార్' (2027) చిత్రంలో కనిపించనుంది.

ఇదిలా ఉండగా ఈ బాలీవుడ్ బ్యూటీ సిస్టర్ షాహీన్ భట్ ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్‌ ఇషాన్ మెహ్రీతో తన నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ జంట తమ బంధం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  మేము ఒకరినొకరు ఇష్టపడటంలో కాస్త అతిగా చేశామేమో అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న షాహీన్ తల్లి, ఆలియా అత్త నీతూ కపూర్, సోనీ రజ్దాన్, అనన్య పాండే, నీనా గుప్తా, మసాబా గుప్తా,  జోయా అక్తర్, షనయా కపూర్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.

కాగా.. మహేష్ భట్, సోనీ రజ్దాన్‌ల పెద్ద కుమార్తె షాహీన్ భట్. ఆమె స్క్రీన్ రైటర్‌తో పాటు మానసిక ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నారు. షాహీన్ కాబోయే భర్త ఇషాన్ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ కోచ్‌గా రాణిస్తున్నారు. ఆమెతో పాటు ఆలియా భట్, పూజా భట్, రాహుల్ భట్ అనే మరో ముగ్గురు వీరికి సంతానం. ఆలియా భట్‌ ఇప్పటికే రణ్‌బీర్‌ కపూర్‌ను పెళ్లాడగా.. వీరికి రాహా అనే మూడేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement