
తమిళ స్టార్ దళపతి విజయ్.. రీసెంట్‌గానే మధురైలో భారీ బహిరంగ సభ పెడితే ఏకంగా లక్షలాది మంది అభిమానులు వచ్చారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్న విజయ్.. మరోవైపు తన చివరి చిత్రాన్ని పూర్తి చేసే పనిలోనూ ఉన్నాడు. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్‍డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 20 ఏళ్లకే నటి పెళ్లి.. ఏడాది తిరిగేలోపు కూతురు)
విజయ్ 'జన నాయగన్'... తెలుగు చిత్రం 'భగవంత్ కేసరి' రీమేక్ అని ప్రచారం అయితే ఉంది కానీ నిజమేంటి అనేది మూవీ రిలీజైతే తప్ప తెలియదు. అయితే ఇది విజయ్ చివరి చిత్రమని ప్రచారం నడుస్తోంది కాబట్టి ఇందులో పలు సర్‌ప్రైజులు ఉండబోతున్నాయట. తమిళ స్టార్ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్, లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారట. సోషల్ మీడియాలో ఈ రూమర్ గట్టిగానే వినిపిస్తుంది.
ఈ ముగ్గురు దర్శకులు కూడా విజయ్‌తో సినిమాలు తీశారు. అట్లీ, లోకేశ్ తలో రెండేసి చిత్రాలు చేయగా.. నెల్సన్ ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. అలా విజయ్‌పై అభిమానం దృష్ట్యా.. ఇతడి చివరి చిత్రమైన 'జన నాయగన్'లో జర్నలిస్టులుగా చిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇకపోతే ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. 'ప్రేమలు' మమిత బైజు కీలక పాత్ర చేస్తోంది. హెచ్. వినోద్ దర్శకుడు కాగా అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)