
సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఒకవేళ అలా చేస్తే ఎక్కడ తమ కెరీర్ డ్యామేజ్ అవుతుందోనని కంగారుపడుతుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు అలా ఓ నటి.. 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు ఏడాది తిరిగేలోపు ఓ అమ్మాయికి తల్లి కూడా అయిపోయింది. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఎవరా నటి?
(ఇదీ చదవండి: కొత్త కారు కొన్న తెలుగు నటుడు.. రేటు ఎంతో తెలుసా?)
ఓటీటీ ప్రియులకు 'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎల్ అలియాస్ ఎలెవన్ అనే లీడ్ రోల్ చేసిన మిల్లీ బాబీ బ్రౌన్.. పలు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఐదో సీజన్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే మిల్లీ గత కొన్నాళ్లుగా జేక్ బొంగియోవి అనే యువకుడితో డేటింగ్ చేసింది. గతేడాది అక్టోబరులో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. వివాహం జరిగేటప్పటికి మిల్లీ వయసు 20 ఏళ్లు. దీంతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏడాది లోపే ఓ పాపకు తల్లి కూడా అయినట్లు స్వయంగా మిల్లీనే ప్రకటించింది. అయితే పాపని దత్తత తీసుకున్నామని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)