
ర్యాపర్, నటుడు, రచయిత.. ఇలా పలు టాలెంట్స్ ఉన్న నోయెల్ సీన్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. ప్రస్తుతానికైతే నటుడిగా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. కుదిరినప్పుడు షోల్లోనూ పాల్గొంటున్నాడు. అలాంటి ఇప్పుడు ఖరీదైన కొత్త కారు కొనేశాడు. అందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ కారు రేటు ఎంత?
హైదరాబాద్‌కి చెందిన నోయెల్.. 2006లో 'సంభవామి యుగేయుగే' అనే మూవీతో కెరీర్ ఆరంభించాడు. తర్వాత మంత్ర, మగధీర, ఈగ తదితర చిత్రాల్లో కనిపించి కనిపించని పాత్రలు చేశాడు. అయితే 'కుమారి 21 ఎఫ్' మూవీలో విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. అప్పటినుంచి కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
బిగ్‌బాస్ 4వ సీజన్‌లోనూ పాల్గొన్నాడు కానీ ఆరోగ్య కారణాల రీత్యా మధ్యలోనే బయటకొచ్చేశాడు. ప్రస్తుతానికైతే నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మహీంద్ర కంపెనీకి చెందిన బీఈ6 మోడల్ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేశాడు. దీని ధర మార్కెట్‌లో రూ.20 లక్షల వరకు ఉంది. ఈ కారుని తల్లి చేతుల మీదుగా కొనుగోలు చేశాడు. ఆ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.
వ్యక్తిగత విషయానికొస్తే.. నోయెల్ 2019లో హీరోయిన్ ఎస్తర్ నోరాన్హాని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏడాదిలోనే వీళ్లిద్దరూ విడిపోయారు. నోయెల్‌లానే ఎస్తర్ కూడా ఒకటి అరా సినిమాలు చేస్తోంది.
(ఇదీ చదవండి: తండ్రయిన టాలీవుడ్ కమెడియన్.. ఫొటో వైరల్)