breaking news
Millie Bobby Brown
-
15 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల ముసలి అని ట్రోల్ చేశారు : నటి
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్ తన రూపం, వయస్సుపై నెట్టింట వస్తున్న ట్రోల్స్‌పై తీవ్రంగా మండిపడ్డారు. 'స్ట్రేంజర్ థింగ్స్' (Stranger Things) సిరీస్‌లో కేవలం 11 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం గ్లోబల్ నటిగా, బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తున్న ఆమె.. ఇటీవల జే షెట్టి 'ఆన్ పర్పస్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పాడ్‌కాస్ట్‌లో మిల్లీ బాబీ బ్రౌన్ మాట్లాడుతూ, పరిశ్రమలో బాలనటిగా ఎదుగుతున్న క్రమంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘ఇతరుల అభిప్రాయాలు, విమర్శలు నా ఎదుగుదలకి ఎంతమాత్రం సహాయపడలేదు. నేను ఎలా కనిపిస్తున్నానో అనే దానిపై జనాలు ఎప్పుడూ నెగెటివ్‌గా మాట్లాడటం వింటూనే పెరిగాను. నేను కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. 60 ఏళ్ల మహిళలా కనిపిస్తున్నానంటూ కొందరు దారుణంగా విమర్శించారు’అని బ్రౌన్ ఆవేదన వ్యక్తం చేశారు.స్టైలింగ్ విషయంలో నెటిజన్ల ద్వంద్వ ప్రమాణాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘నేను హై హీల్స్ వేసుకుంటే ఒకలా విమర్శిస్తారు. అదే ఒక సూట్ వేసుకుంటే, నా వయస్సు కంటే పెద్దగా కనిపిస్తున్నానని అంటారు. ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లకు సొంత అభిప్రాయమంటూ ఏది ఉండదు. నా దృష్టిలో వాళ్లంతా రోబోలు’ అని బ్రౌన్ అన్నారు.చిన్న వయసులోనే పరిశ్రమలోకి అడుగుపెట్టడం వల్ల ఎదురైన అనుభవాలు తనకు జీవితపాఠాలు నేర్పాయని, బాలనటులను అన్ని విధాలుగా రక్షించడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నానని ఆమె స్పష్టం చేశారు. పద్నాలుగేళ్ల వయసులోనే యూనిసెఫ్ అత్యంత పిన్న వయస్కురాలైన గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులైన బ్రౌన్, పిల్లల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.ప్రస్తుతం 'ఎనోలా హోమ్స్ 3' చిత్రంలో నటిస్తున్న బ్రౌన్, తన కెరీర్లో కొత్త మలుపులు చవిచూస్తున్నారు. తనపై వచ్చే విమర్శలను ధైర్యంగా ఎదుర్కొంటూనే, భవిష్యత్ తరాల బాలనటుల భద్రత కోసం గళమెత్తడం కొనసాగిస్తానని బ్రౌన్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు -
20 ఏళ్లకే నటి పెళ్లి.. ఏడాది తిరిగేలోపు కూతురు
సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఒకవేళ అలా చేస్తే ఎక్కడ తమ కెరీర్ డ్యామేజ్ అవుతుందోనని కంగారుపడుతుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు అలా ఓ నటి.. 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు ఏడాది తిరిగేలోపు ఓ అమ్మాయికి తల్లి కూడా అయిపోయింది. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఎవరా నటి?(ఇదీ చదవండి: కొత్త కారు కొన్న తెలుగు నటుడు.. రేటు ఎంతో తెలుసా?)ఓటీటీ ప్రియులకు 'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎల్ అలియాస్ ఎలెవన్ అనే లీడ్ రోల్ చేసిన మిల్లీ బాబీ బ్రౌన్.. పలు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఐదో సీజన్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే మిల్లీ గత కొన్నాళ్లుగా జేక్ బొంగియోవి అనే యువకుడితో డేటింగ్ చేసింది. గతేడాది అక్టోబరులో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. వివాహం జరిగేటప్పటికి మిల్లీ వయసు 20 ఏళ్లు. దీంతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏడాది లోపే ఓ పాపకు తల్లి కూడా అయినట్లు స్వయంగా మిల్లీనే ప్రకటించింది. అయితే పాపని దత్తత తీసుకున్నామని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Millie Bobby Brown (@milliebobbybrown) -
20 ఏళ్లకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి
సినిమా హీరోయిన్లు చాలామంది లేటుగానే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బ్యూటీ 20 ఏళ్లకే తొందరపడింది. తన 22 ఏళ్ల ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. మరోవైపు హ్యాపీగానూ ఫీలవుతున్నారు. వీళ్ల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్‌తో మన దగ్గర కూడా పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి మిల్లీ బాబీ బ్రౌన్. దీనితో పాటు పలు సినిమాలు, ఇతర సిరీసులు కూడా ఈమె చేసింది. అయితే టీనేజీలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి మోడల్ జేక్ బొంగివోయ్‌తో రిలేషన్లో ఉంది. సోషల్ మీడియాలో పలు ఫొటోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటకొచ్చింది.అయితే సడన్‌గా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారనే న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమేనని, గతవారం ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక చాలా సీక్రెట్‌గా జరిగింది. ఇలా చిన్న వయసులోనే 'స్ట్రేంజర్ థింగ్స్' నటి మిల్లీ బాబీ బ్రౌన్ పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారిపోయింది.(ఇదీ చదవండి: Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)


