కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ'జన నాయగణ్'. పొలిటిక్స్‌లో అడుగుపెట్టిన తర్వాత విజయ్ కెరీర్‌లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'దళపతి కచేరీ' అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
అయితే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. యూట్యూబ్‌లో ఏకంగా 44 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. దీంతో ఇవన్నీ ఫేక్ వ్యూస్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బాట్స్ ద్వారా ఈ వ్యూస్ వచ్చాయని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రిలీజైన గంటలోనే ఏకంగా 3 మిలియన్స్ వ్యూస్ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు వ్యూస్ పెంచుకునేందుకు బాట్స్ ఉపయోగపడ్డాయా అంటూ ట్రోల్ చేశారు.
కచేరీ సాంగ్‌పై వస్తున్న ఆరోపణలపై యూట్యూబ్ కూడా స్పందించింది. ఇలాంటి వాటిని గుర్తించడానికి(లైక్‌లు, వ్యూస్) తమ వద్ద ప్రత్యేక వ్యవస్థ ఉందని యూట్యూబ్ తెలిపింది. అవీ ఒరిజినల్ లేదా ఫేక్ అని ధృవీకరించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ కూడా ఉందని పేర్కొంది.
కాగా.. దళపతి కచేరి' పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించగా.. అనిరుధ్, అరివు, విజయ్ ఆలపించారు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
To maintain a fair & positive experience across YouTube, we have systems that verify if views are valid & should be counted! more on that here: https://t.co/7ia2e2f2VE
— TeamYouTube (@TeamYouTube) November 12, 2025


