breaking news
Thalapathy 61
-
డేట్ ఛేంజ్
ఎస్... ఫలానా డేట్‌కి థియేటర్స్‌కి వచ్చేస్తాం అంటూ యూనిట్ ఒక డేట్ ఫిక్స్ చేసి, ప్రకటిస్తుంది. అయితే కొన్నిసార్లు సెట్ చేసిన డేట్‌కి ఆ సినిమా రాదు... వాయిదా పడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా వాయిదా వేస్తుంటారు. కొన్ని సినిమాల షూటింగ్ పూర్తి కాదు... కొన్ని పూర్తయినా గ్రాఫిక్స్ పూర్తి కావు... కొన్నయితే అన్నీ పూర్తయినా వేరే సినిమాలతో క్లాష్ అయ్యే పరిస్థితిలో తప్పక వాయిదా పడతాయి. కారణాలు ఏమైనప్పటికీ ఈ మధ్య కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ చిత్రాల పోస్ట్ పోన్ స్టోరీ తెలుసుకుందాం. వేసవిలో విశ్వంభర చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ‘శుభలేఖ’ సుధాకర్, కునాల్ కపూర్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇందుకు కారణం... చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా. తనయుడి ‘గేమ్ చేంజర్’ కోసం తన ‘విశ్వంభర’ మూవీ విడుదలని చిరంజీవి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ 2025 జనవరి 10న రిలీజ్ అయింది. 2025 సంక్రాంతికి వాయిదా పడిన ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందని భావించినప్పటికీ కాలేదు. ఇందుకు కారణం వీఎఫ్ఎక్స్ పనులు. ఈ కారణంగా చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించగా, వెంకటేశ్ ముఖ్య పాత్ర పోషించారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక 2025 జనవరి 10న రిలీజ్ వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి... విడుదల తేదీపై స్పష్టత రావాలి. మార్చి టు ఏప్రిల్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. ‘ఉప్పెన’ మూవీ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీని రామ్‌చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ‘‘రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా ‘పెద్ది’. హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం రామ్‌చరణ్ ఫుల్‌మాస్ లుక్‌లోకి మారిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. అయితే వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చాం. మా సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి...’ పాట అన్ని ΄్లాట్ఫామ్లలో అద్భుతమైన స్పందనను అందుకుంది. ఈ పాట 200 మిలియన్ల వ్యూస్ దాటి సినిమాపై అంచనాలను భారీగా పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ముందుకు వచ్చి, మార్చి 26న రిలీజ్ కానుంది. మార్చి నుంచి ఆగస్టుకి... ‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘కిల్, గ్యారా గ్యారా’ వంటి హిందీ చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న రాఘవ్ జుయల్ ‘ది ΄్యారడైజ్’లో భాగమయ్యారు. ఓ కీలక పాత్రను సంపూర్ణేష్ బాబు చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో జడల్ అనే పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. నానిపై ‘ఆయా షేర్..’ అంటూ సాగే ఇంట్రో సాంగ్ చిత్రీకరిస్తున్నారు. వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కుతున్న ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మాస్ ట్యూన్ అందించారు. కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ భారీ విజువల్స్‌తో ఈ సాంగ్‌ని పూర్తి స్థాయి క్రౌడ్ ప్లీజర్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పోస్ట్‌పోస్ చేసి, ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ‘‘మ్యాసివ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ హాటెస్ట్ పాన్ ఇండియన్ రిలీజెస్‌లో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. మా సినిమాని ముందుగా మార్చి 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే తాజాగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రిలీజ్ డేట్‌కి మా సినిమాకు వరుసగా మూడు వారాల పండగలు కలిసి రానున్నాయి. మొదటి వారంలో ఓనం, మిలాద్–ఉన్–నబీ పండగలు, రెండో వీకెండ్లో రాఖీ, మూడో వారంలో జన్మాష్టమి ఉండటం వల్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ది ΄్యారడైస్’కి బాక్సాఫీస్ వద్ద బిగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ΄్లానింగ్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాని... ఈ నిర్ణయంతో మరోసారి తన మార్కెటింగ్ సెన్స్‌ని చూపించారు’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఫిబ్రవరి టు ఏప్రిల్... ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో ఈ నెల 13న రిలీజ్ చేస్తామని యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. అయితే ఆ తేదీకి విడుదల వాయిదా పడి, ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రోడక్షన్ పనులు... ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న యూనిట్... కొంచెం ఆలస్యమైనా సరే బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 10కి వాయిదా వేసినట్లు టాక్. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల కానుంది. 1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ్రపాంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవాడు. అల్లరిగా తిరిగే అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ‘సలార్’ మూవీ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెంచింది. అదే విధంగా సెంథిల్ కుమార్ విజువల్స్ ఈ మూవీకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. మే 1న లెనిన్ వస్తాడా? అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీలో అఖిల్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ‘లెనిన్’ని మే 1న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే... ఆ తేదీకి రిలీజ్ కాకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి కారణం రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా అని ఫిల్మ్‌నగర్ టాక్. మార్చి 27న ‘పెద్ది’ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 30కి విడుదల వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని టాక్. ‘లెనిన్’ని మే 1న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే కొత్త విడుదల తేదీపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి... ముందుగా అనుకున్నట్లు ‘లెనిన్’ మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తాడా? లేదా? లేకుంటే మరో కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ‘లెనిన్’ పై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ మూవీ తప్పకుండా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. మార్చి నుంచి ఏప్రిల్‌కి? అడివి శేష్ హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీకి రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసి, ఉగాది కానుకగా ఈ ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్‌లో ఉన్న రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే ఈ మూవీ మరోసారి విడుదల వాయిదా పడనుందని ఫిల్మ్‌నగర్ టాక్. మార్చి నెలలో యశ్ ‘టాక్సిక్’, రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకి వస్తుండటంతో ‘డెకాయిట్’ విడుదల వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ కానుందనే చర్చ నడుస్తోంది. అయితే మార్చి 19న విడుదల వాయిదా గురించి చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘‘ప్రేమ, ప్రతీకారం నేపథ్యంలో థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘డెకాయిట్’. ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్‌లోని ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌కి పాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారు. ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం మాదే. అంతర్జాతీయ స్థాయిలో తీసిన ‘డెకాయిట్’ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... యూనిట్ ముందుగా ప్రకటించినట్లు మార్చి 19న ‘డెకాయిట్’ సినిమా విడుదలవుతుందా? లేదా అనేది వేచి చూడాలి. ∙సంబరాలు ఎప్పుడు? సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు (ఎస్వైజీ). ఐశ్వర్యా లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించినప్పటికీ పోస్ట్‌పోన్ అయింది. అయితే ఆ తర్వాత విడుదల తేదీపై యూనిట్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, మార్చి 14న థియేటర్లలోకి రానుందని టాక్. ‘‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం రూ. 125 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందింది. సాయిదుర్గా తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ ్రపాజెక్ట్గా ఈ మూవీ నిలుస్తుంది. మా సినిమాలోని సీజీ వర్క్ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వెట్రి పళనిసామి విజువల్స్, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని యూనిట్ తెలిపింది. నాయకుడు వచ్చేదెప్పుడు? తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా పొంగల్ కానుకగా ఈ ఏడాది జనవరి 9 విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కొత్త విడుదల తేదీపై ఎలాంటి ప్రకటన రాలేదు. విజయ్ ఇప్పటికే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ కారణంగా ఆయన సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారు. అందుకే విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకుడు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల్లో ఉంది. మరి... అడ్డంకులు దాటుకుని ‘జన నాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడు? అన్నది వేచి చూడాలి. -
విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ సినిమా కూడా వాయిదా..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం జన నాయగణ్. ఈ పొంగల్‌కు రిలీజ్ కావాల్సిన చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. సెన్సార్ వివాదం కాస్తా కోర్టుకు చేరడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు చేస్తోన్న చివరి చిత్రం కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు.అయితే తాజాగా విజయ్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. ఈ సంక్రాంతి కానుకగా విజయ్ సూపర్ హిట్ మూవీ థేరీ రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ మూవీని కూడా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 14న థేరీ రీ రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. జన నాయగణ్ మూవీ సెన్సార్ బోర్డు వివాదం రీ రిలీజ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాబోయే చిత్రాల నిర్మాతల అభ్యర్థన మేరకు థేరి విడుదలను వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నామనివి క్రియేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, అమీ జాక్సన్ నటించారు.As per the request from the producers of upcoming releases, we have decided to postpone the release of "Theri".— Kalaippuli S Thanu (@theVcreations) January 13, 2026 -
దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
విజయ్ కచేరి సాంగ్.. ఫేక్ వ్యూస్‌పై స్పందించిన యూట్యూబ్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ'జన నాయగణ్'. పొలిటిక్స్‌లో అడుగుపెట్టిన తర్వాత విజయ్ కెరీర్లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'దళపతి కచేరీ' అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.అయితే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. యూట్యూబ్‌లో ఏకంగా 44 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. దీంతో ఇవన్నీ ఫేక్ వ్యూస్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బాట్స్ ద్వారా ఈ వ్యూస్ వచ్చాయని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రిలీజైన గంటలోనే ఏకంగా 3 మిలియన్స్ వ్యూస్ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు వ్యూస్ పెంచుకునేందుకు బాట్స్ ఉపయోగపడ్డాయా అంటూ ట్రోల్ చేశారు.కచేరీ సాంగ్‌పై వస్తున్న ఆరోపణలపై యూట్యూబ్ కూడా స్పందించింది. ఇలాంటి వాటిని గుర్తించడానికి(లైక్‌లు, వ్యూస్) తమ వద్ద ప్రత్యేక వ్యవస్థ ఉందని యూట్యూబ్ తెలిపింది. అవీ ఒరిజినల్ లేదా ఫేక్ అని ధృవీకరించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ కూడా ఉందని పేర్కొంది. కాగా.. దళపతి కచేరి' పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించగా.. అనిరుధ్, అరివు, విజయ్ ఆలపించారు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. To maintain a fair & positive experience across YouTube, we have systems that verify if views are valid & should be counted! more on that here: https://t.co/7ia2e2f2VE— TeamYouTube (@TeamYouTube) November 12, 2025 -
దళపతి విజయ్ చివరి సినిమా.. రిలీజ్ తేదీ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం 'జననాయగన్'. ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారు. అంతేకాకుండా కోలీవుడ్ భామ శృతిహాసన్ అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి ముందు నటిస్తోన్న చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పొంగల్ పండుగ సందర్భంగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నటి ప్రియమణి, దర్శకుడు గౌతమ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు.pic.twitter.com/JeY4Vpnc3J— Vijay (@actorvijay) March 24, 2025 -
విజయ్ సభకు హోరెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
ఆ హీరో కోసం ఐటెం సాంగ్ త్రిష
-
విజయ్ 69వ చిత్రంలో మలయాళ బ్యూటీ?
నటుడు విజయ్ కథానాయకుడిగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం గోట్. ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని సెపె్టంబర్ 5న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో విజయ్ తన 69వ చిత్రంపై దృష్టి పెడుతున్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్‌కి ఇదే చివరి చిత్రం అనే ప్రచారం చాలాకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం తన రాజకీయ జీవితానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఆయన భావించినట్లు సమాచారం. కాగా దర్శకుడు హెచ్.వినోద్ నటుడు కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. అందుకు కథను కూడా తయారు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం డ్రాప్ అయ్యిందని తెలిసింది. అయితే అదే కథతో విజయ్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి హెచ్.వినోద్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కథ సమకాలీన రాజకీయలు ఇతి వృత్తంగా ఉంటుందని, అందుకే విజయ్ ఈ చిత్రం చేయడానికి అంగీకరించినట్లు టాక్. ఏదేమైనా ఈ చిత్రానికి సంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను దర్శకుడు హెచ్.వినోద్ ప్రారంభించారనీ నవంబర్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రంలో లుక్ కోసం నటుడు విజయ్‌తో ఇటీవల ఫొటో సెషన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా ఇందులో సంచలన నటి సమంత ప్రధాన పాత్రను పోషించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మలయాళ కుట్టి మమితా బైజూ ఇందులో విజయ్‌తో కలిసి నటించనున్నారనే టాక్ వైరల్ అవుతోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కేరళ కుట్టి ప్రేమలు అనే మలయాళ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కాగా విజయ్ సరసన నటించే అవకాశం వచ్చిందంటే నిజంగా ఆమె లక్కే అని చెప్పాలి. కాగా కేవీఎన్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందించనున్నారు. -
సూపర్ హిట్ సాంగ్.. రష్మిక అదరగొట్టేసిందిగా!
గతేడాది యానిమల్ సూపర్ హిట్ కొట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆమె ప్రస్తుతం పుష్ప-2 మూవీలో నటిస్తున్నారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీని డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరో నెల రోజుల షూటింగ్‌తో పాటు వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్‌లో ఉండడం వల్లే పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు వెల్లడించారు.అయితే తాజాగా పుష్ప భామ రష్మికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. వారసుడు మూవీలోని 'రంజితమే' అనే సాంగ్‌కు స్టేజీపైనే డ్యాన్స్ వేస్తూ కనిపించింది. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి సరసన వారసుడు చిత్రంలో రష్మిక నటించారు. అందులోని పాటకు కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Rashmika dancing for Ranjithame in Karunagapally, Kollam (Kerala). pic.twitter.com/p8phqgYDWe— AB George (@AbGeorge_) July 25, 2024 -
రిలీజ్ కి ముందే రికార్డులు
-
దళపతి విజయ్.. థియేటర్లే కాదు.. సోషల్ మీడియా కూడా షేక్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆయనకు భారీసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న హీరో దళపతి విజయ్. ఇటీవలే వారసుడు(వారీసు) మూవీతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ప్రస్తుతం సెలబ్రిటీలు సోషల్ మీడియాను విరివిగా వాడేస్తున్నారు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం సినీతారలు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు ఇన్‌స్టాలో ఖాతా లేదంటే విచిత్రంగా ఉంది కదూ. అవునండీ తాజాగా దళపతి విజయ్ తన ఇన్‌స్టా ఖాతాను తెరిచారు. ఇంకేముంది ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. విజయ్ ఖాతా తెరిచిన 24 గంటల్లోనే ఏకంగా 4.6 మిలియన్ల ఫాలోవర్లు వచ్చేశారు. ఖాతా ప్రారంభించిన 99 నిమిషాల్లో 1 మిలియన్ల ఫాలోవర్స్ చేరిన తొలి ఇండియన్‌గా విజయ్ నిలిచారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ విషయంలో విజయ్ మూడోస్థానం దక్కించుకున్నారు. తొలి రెండు స్థానాల్లో బీటీఎస్ వీ(43 నిమిషాలు), ఎంజెలీనా జోలీ(59 నిమిషాలు) ఉన్నారు. దీంతో నెటిజన్స్ దళపతి విజయ్ అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు. అంతకుముందు కేవలం 15 గంటల్లో 3.9 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. విజయ్ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇస్తూ ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇన్‌స్టాలో రాస్తూ.. 'హలో నంబా అండ్ నంబిస్' వెల్కమ్ సందేశం ఇచ్చారు. కాగా.. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘లియో’ షూటింగ్లో ఉన్నారు. గతంలో ట్విటర్ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న విజయ్, కొంతకాలం విరామం తీసుకున్నాడు. దళపతికి ఇప్పటికే ఫేస్బుక్లో 7.8 మిలియన్లు, ట్విట్టర్లో 4.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Vijay (@actorvijay) -
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వారసుడు.. ఎన్ని కోట్లంటే?
తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇటీవల చెన్నైలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్ల చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. అలాగే ఓవర్సీస్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటగా.. ఆస్ట్రేలియాలో 500 కె డాలర్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో విజయ్ డ్యాన్స్, పాటలు, కామెడీ, యాక్షన్‌తో కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తోంది. #Varisu has crossed the A$500K mark in Australia 🇦🇺 pic.twitter.com/AaNXF48oHh — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 #Varisu crosses the Million mark in USA 🇺🇸 pic.twitter.com/XPEWGkbt2K — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 #Varisu has joined the ₹ 150 Crs Gross Club at the WW Box office.. pic.twitter.com/1i95Nk9f4Z — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 -
'గ్రౌండ్లో ఎంతమంది ఉన్నా.. చూసేది ఆ ఒక్కడినే'.. వారసుడు ట్రైలర్
తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కించిన చిత్రం 'వారిసు'. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రిలీజ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తుండగా.. తమన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఈ మూవీతో నేరుగా పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ కథా చిత్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
జ్యోతికకు బదులు నిత్యామీనన్
రాజకీయాల్లో ముఖ్యమంత్రి రాజీనామా, ఆ తర్వాత రాజీనామా వెనక్కు అంటూ జరిగే అనూహ్య పరిణామాల్లాగే చిత్రరంగంలోనూ అనుకోని మలుపులు జరుగుతుంటాయి. అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించనున్న 61వ చిత్రంలో సమంత, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో ముఖ్య కథాపాత్రకు జ్యోతిక వద్ద కథ చెప్పి ఓకే పొందారు అట్లీ. ఆ తర్వాత జ్యోతిక తన పాత్రలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా కోరగా దాన్ని దర్శకుడు అంగీకరించలేదు. దీంతో ఆ చిత్రం నుంచి జ్యోతిక వైదొలగారు. తర్వాత ఎవరిని ఒప్పందం చేసుకోవాలనే విషయంలో సందిగ్ధం ఏర్పడింది. ఆ తర్వాత అసిన్, సిమ్రాన్, విద్యాబాలన్ పేర్లు ప్రసావనకు వచ్చాయి. అసిన్‌ను అట్లీ సంప్రదించగా ఆమె మళ్లీ నటనపై ఆసక్తి చూపలేదని సమాచారం. ప్రస్తుతం ఆ అవకాశం నిత్యామీనన్‌ను వరించింది. ఈ కథ విని నటించేందుకు ఒప్పుకున్నారామె. నిత్యామీనన్ మాత్రం అనుష్క, సమంత, నయనతార వంటి జంట తారల చిత్రాల్లోనే నటిస్తున్నారు. చివరిగా ఆమె ఇరుముగన్ చిత్రంలో నటించారు. సోలో హీరోయిన్గా నటించేందుకు నిత్య ఒప్పుకున్నప్పటికీ అరుదుగానే అవకాశాలు లభిస్తున్నాయి. ‘మీరు కాస్తా లావుగా ఉండడంతో హీరోయిన్ అవకాశాలు రావడం లేదు, కొంచెం స్లిమ్‌గా మారితే బాగుంటుంది’ అని నటుడు లారెన్స్ సలహా ఇచ్చారు. దీంతో ఆమె సన్నబడేందుకు రోజూ వ్యాయామం చేస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఆమెకు అట్లీ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించే అవకాశమే లభించింది.


