దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం జన నాయగణ్. ఈ పొంగల్‌కు రిలీజ్ కావాల్సిన చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. సెన్సార్ వివాదం కాస్తా కోర్టుకు చేరడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు చేస్తోన్న చివరి చిత్రం కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు.
అయితే తాజాగా విజయ్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. ఈ సంక్రాంతి కానుకగా విజయ్ సూపర్ హిట్ మూవీ థేరీ రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ మూవీని కూడా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 14న థేరీ రీ రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. జన నాయగణ్ మూవీ సెన్సార్ బోర్డు వివాదం రీ రిలీజ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాబోయే చిత్రాల నిర్మాతల అభ్యర్థన మేరకు థేరి విడుదలను వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నామనివి క్రియేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, అమీ జాక్సన్ నటించారు.
As per the request from the producers of upcoming releases, we have decided to postpone the release of "Theri".
— Kalaippuli S Thanu (@theVcreations) January 13, 2026


