Theri movie
-
నా సినిమాని పట్టుకుని 'తెరి' చేశారు.. హరీశ్ శంకర్ కామెంట్స్
మార్చి నెలాఖరులో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఒకేఒక్క పెద్ద సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రంపై ఇప్పటివరకు అనుకున్నంతగా బజ్ లేదు. ఎందుకో రావట్లేదు కూడా. దానికి చాలానే కారణాలు. ప్రాజెక్ట్ మొదలైనప్పుడే ఇది రీమేక్ అనే రూమర్స్ గట్టిగా వినిపించాయి. ఈ మూవీకి రైటర్‌గా పనిచేసిన ఒకప్పటి దర్శకుడు దశరథ్.. ఇది 'తెరి' రీమేక్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇదంతా మొదలైంది. ఇప్పటికే అదే నిజమని చాలామంది ప్రేక్షకులు నమ్ముతున్నారు.మూవీ టీమ్ గానీ దర్శకుడు హరీశ్ శంకర్ గానీ 'ఉస్తాద్ భగత్ సింగ్' దేనికి రీమేక్ కాదని గతంలో చెప్పారు. తాజాగా పలువురు జర్నలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలోనూ హరీశ్ శంకర్.. మరోసారి రీమేక్ గురించి స్పష్టత ఇచ్చాడు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా అనిపించాయి.(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)'తెరి మూవీలో ట్వింకిల్ ట్వింకిల్ అంటూ పాడే ఓ సీన్ ఉంటుంది. అది నా 'గబ్బర్ సింగ్' మూవీలోని అంత్యాక్షరి ఎపిసోడ్‌ని స్పూర్తిగా తీసుకుని తీశారు. నా సినిమాని పట్టుకుని తెరి చేస్తే.. నువ్వు 'తెరి' రీమేక్ చేస్తున్నావంటే నేను ఏం సమాధానం చెప్పాలో నాకర్థం కావట్లేదు' అని హరీశ్ శంకర్ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దాని దిగువన కామెంట్స్ చాలావరకు ఈ దర్శకుడికి వ్యతిరేకంగానే వస్తుండటం విచిత్రం.కెరీర్లో చాలా సినిమాలు చేసిన హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కానీ తర్వాత నుంచి ఒక్కటీ సరైన సినిమా తీయలేకపోతున్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేశ్ లాంటి ఒకటి రెండు మూవీస్ ఆకట్టుకున్నప్పటికీ మరీ సూపర్ హిట్ కాలేకపోయాయి. హరీశ్ శంకర్ గత చిత్రం 'మిస్టర్ బచ్చన్' అయితే ఘోరమైన డిజాస్టర్. చూడాలి మరి హరీశ్ శంకర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ సినిమా కూడా వాయిదా..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం జన నాయగణ్. ఈ పొంగల్‌కు రిలీజ్ కావాల్సిన చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. సెన్సార్ వివాదం కాస్తా కోర్టుకు చేరడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు చేస్తోన్న చివరి చిత్రం కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు.అయితే తాజాగా విజయ్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. ఈ సంక్రాంతి కానుకగా విజయ్ సూపర్ హిట్ మూవీ థేరీ రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ మూవీని కూడా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 14న థేరీ రీ రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. జన నాయగణ్ మూవీ సెన్సార్ బోర్డు వివాదం రీ రిలీజ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాబోయే చిత్రాల నిర్మాతల అభ్యర్థన మేరకు థేరి విడుదలను వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నామనివి క్రియేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, అమీ జాక్సన్ నటించారు.As per the request from the producers of upcoming releases, we have decided to postpone the release of "Theri".— Kalaippuli S Thanu (@theVcreations) January 13, 2026 -
సడన్ సర్ప్రైజ్.. సంక్రాంతికి విజయ్ మూవీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్. ముందుగా బ్యాడ్‌న్యూస్ ఏంటంటే.. జన నాయగణ్ ఈ నెలలో రిలీజ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. గుడ్‌న్యూస్ ఏంటంటే.. సంక్రాంతికి జన నాయగణ్ లేకపోయినా విజయ్ బ్లాక్‌బస్టర్ మూవీ తేరి థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది.పదేళ్ల సందర్భంగా..ఈ విషయాన్ని నిర్మాత ఎస్.కలైపులి థాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తేరి సినిమా వచ్చి ఈ ఏడాది ఏప్రిల్ 14కి పదేళ్లవుతుంది. ఈ క్రమంలో మళ్లీ అదే తారీఖున విజయ్ సినిమాను రీరిలీజ్ చేయాలని ఎప్పుడో ప్లాన్ చేశారు. కానీ విజయ్ చివరి మూవీ 'జననాయగణ్' సంక్రాంతికి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.తేరి రీరిలీజ్వారికి కాస్త ఊరటనిచ్చేందుకు తేరి రిలీజ్‌ను ముందుకు జరిపారు. ఈ సంక్రాంతికి అంటే జనవరి 15న మళ్లీ విడుదల చేస్తున్నారు. తేరి సినిమా విషయానికి వస్తే ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. తేరీ తెలుగులో పోలీసుడు పేరిట డబ్ అయింది. ఈ సూపర్ హిట్ సినిమా పలు భాషల్లో రీమేక్ అయింది. గతేడాది హిందీలో బేబీ జాన్‌గా రీమేక్ అవగా బాలీవుడ్లో ఆకట్టుకోలేకపోయింది. ஜனவரி 15 முதல் அகிலமெங்கும்Thalapathy @actorvijay @Atlee_dir @gvprakash @Samanthaprabhu2 @iamAmyJackson #ThalapathyVijay #Theri #10YearsOfTheri pic.twitter.com/on3Pr30enp— Kalaippuli S Thanu (@theVcreations) January 10, 2026 చదవండి: బాలీవుడ్ ఎంట్రీ? స్పందించిన మలయాళ హీరోయిన్ -
పవన్ ఫ్యాన్స్‌కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. బయటకు చెప్పకుండా గుక్కపెట్టి ఏడుస్తున్నారు! ఇదంతా కూడా ఓ హిందీ సినిమా వల్లే? ఏంటి నిజమా అని మీరనుకోవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే పవన్ మొదలుపెట్టిన ఓ రీమేక్ ఎప్పుడొస్తుందో తెలీదు కానీ మరో భాషలో మాత్రం అదే సినిమాకు రీమేక్‌గా తీస్తున్న మూవీ.. నెలల వ్యవధిలో విడుదలకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) పవన్ కల్యాణ్ మాట తప్పడంలో స్పెషలిస్ట్. 2019లో ఎన్నికల ముందు తను ఇక ప్రజలకే అంకితమైపోతానని అన్నాడు. తీరా ఎలక్షన్స్ అయిపోగానే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోయేసరికి యూటర్న్ తీసుకున్నాడు. సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. పోనీ అవి అయినా సరిగా చేశాడా అంటే లేదు. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' అని రీమేక్ మూవీస్ చేశాడు. ఇవి అతడి ఫ్యాన్స్‌కి తప్పితే సగటు ప్రేక్షకుడికి పెద్దగా నచ్చలేదు! పైన చెప్పన మూడు సినిమాలతో పాటు 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ'.. ఇలా రెమ్యునరేషన్ వస్తుంది కదా అని చెప్పి చాలా సినిమాల్ని ఒప్పేసుకున్నాడు. వాటిని పూర్తి చేయడంలో మాత్రం నాన్చుడు ధోరణి పాటించాడు. పైకి చెప్పట్లేదు గానీ కక్కలేక మింగలేక ఆయా చిత్రాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకని మీకు అనుమానం రావొచ్చు. అక్కడికే వచ్చేస్తున్నాం. (ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?) పవన్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో దాదాపు మూడేళ్ల క్రితం 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ప్రకటించారు. ఏమైందో ఏమో గానీ అది అలా వాయిదా పడుతూ వస్తోంది. మధ్యలో దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చి కొంత షూటింగ్ చేశారు. కానీ ఇప్పడది హోల్ట్‌లో పడిపోయింది. ఇది తమిళంలో వచ్చిన 'తెరి'(పోలీసోడు) చిత్రానికి రీమేక్. బయటకు చెప్పనప్పటికీ ఈ విషయం అందరికీ తెలుసు. అయితే 'తెరి' తెలుగు రీమేక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. కానీ హిందీలో మాత్రం వరుణ్ ధావన్ హీరోగా ఇదే మూవీని రీమేక్ చేస్తున్నారు. 'బేబీ జాన్' పేరుతో తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఈ ఏడాది మే 31న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశారు. 'తెరి' హిందీ రీమేక్ రిలీజ్ తేదీని కూడా ప్రకటించేసరికి.. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ తెగ గింజుకుంటున్నారు. పాపం వీళ్లకు ఏడుపు ఒకటే తక్కువైందని.. మిగతా హీరోల ఫ్యాన్స్ సైటెర్లు వేస్తున్నారు. (ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?) -
20న తెరి గీతావిష్కరణ
తెరి చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం ఈ నెల 20న జరగనుందన్నది తాజా సమాచారం. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం తెరి. ఇది ఆయన 59వ చిత్రం. విజయ్‌కు జంటగా అందాల భామలు సమంత, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. ప్రభు, రాధిక శరత్‌కుమార్, దర్శకుడు మహేంద్రన్, ముట్టై రాజేంద్రన్, విజయ్ కూతురు దివ్య, నటి మీనా కూతురు నైనిక తదితరులు ముఖ్య పాత్రలు ధరిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడిగా 50వ చిత్రం కావడం మరో విశేషం. వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అట్లీ దర్శకుడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను ముమ్మరంగా జరుపుకుంటోంది. తెరి చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలోని రెండు సాంగ్స్ పల్లవులు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తూ విజయ్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మాత ఈ నెల 20న భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. తెరి చిత్రాన్ని తమిళ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 14న అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాత కలైపులి ఎస్.థాను సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. తెరి సరికొత్త రికార్డులు:సాధారణంగా భారీ చిత్రాల విడుదలకు రెండు రోజులు లేదా వారం రోజుల ముందు థియేటర్లలో అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తారు. అలాంటిది తెరి చిత్రానికి ఏకంగా నెల రోజుల ముందే ప్రీ బుకింగ్ ఆరంభం కావడం రికార్డే అవుతుంది.


