విజయ్-హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘జన నాయగన్’ విడుదల మరింత ఆలస్యం కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఇప్పట్లో జన నాయగన్ విడుల లేనట్లేనని తెలుస్తోంది.
విజయ్ సినిమా జన నాయగన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకి U/A సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కన పెట్టింది. దీనితో విడుదల మరింత ఆలస్యం అయింది. సినిమా సెన్సార్ విషయంలో బోర్డుకు మరింత సమయం ఇచ్చి ఉండాల్సిందని సింగిల్ బెంచ్ జడ్జిని హైకోర్టు సూచించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి జన నాయగన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేంత వరకు ఆగాల్సిందేనని హైకోర్టు తెలిపింది. కొత్తగా మళ్లీ విచారణకు ఆదేశించి సినిమాను రీవైజ్ కమిటీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. దీంతో విడుదల మరింత ఆలస్యం కానుంది.


