చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పుడు పెద్దగా ఎవరూ నమ్మలేదు. విశ్వంభర వంటి సినిమా ఉండగా అనిల్‌తో ప్రాజెక్ట్ ఏంటి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, సెడెన్‌గా అధికారికంగా ప్రకటన రావడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. సినిమా షూటింగ్‌తో పాటు విడుదల వరకు పనులు అన్నీ వేగంగా పూర్తి అయ్యాయి. దీంతో జనవరి 12న ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్‌లోకి వచ్చేశాడు. మొదటి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్స్ సాధించాడు.
‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా రెండు వారాలు పూర్తి చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 350 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సినిమా ప్రకటన నుంచి థియేటర్స్‌లో సక్సెస్ సెలబ్రేసన్స్ వరకు ఉన్న ప్రధాన అంశాలను ఒక వీడియోలో చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మెమోరీస్ మీరూ చూసేయండి.


