చిరంజీవి కాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై 'చిన్మయి' కౌంటర్‌ | Singer Chinmayi Sensational Reaction To Chiranjeevi Comments On Casting Couch In Industry, Post Went Viral | Sakshi
Sakshi News home page

చిరంజీవి కాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలపై 'చిన్మయి' కౌంటర్‌

Jan 27 2026 9:38 AM | Updated on Jan 27 2026 11:16 AM

Singer Chinmayi react chiranjeevi comments on Casting Couch

‘మనశంకర వరప్రసాద్’ మూవీ సక్సెస్ మీట్‌లో  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ప్రముఖ సింగర్‌ చిన్మయి విభేదించారు. అయితే, చిరంజీవి  పట్ల గౌరంవంగానే ఆమె స్పందించారు. కానీ, ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న  కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె మరోసారి బలంగానే రియాక్ట్‌ అయ్యారు.

చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి ఇలా స్పందించారు. 'ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ లేదు అనేది పూర్తిగా అపద్దం.   ఇంగ్లీష్‌లో ‘కమిట్‌మెంట్’ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని అర్థం వస్తుంది.. కానీ, ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరు ఉంటుంది. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే  ఇండస్ట్రీలో ఛాన్సులు రావు. ఇక్కడ చాలామంది మగవారు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం సర్వసాధారణం. లెజెండరీ చిరంజీవి గారి తరం వేరు.. ఇప్పుడు జరుగుతున్నది వేరు. చిరంజీవి జనరేషన్‌లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు… ప్రస్తుతం పరిశ్రమలో అలాంటి వాతావరణం లేదు. చిరు తరంలో మహిళా  కళాకారులతో స్నేహితులుగా తమ కుటుంబ సభ్యులుగా ఉండేవారు. ఒకరినొకరు గౌరవించుకునేవారు.  లెజెండ్‌లతో పనిచేసిన వారందరూ లెజెండ్‌లే. చిరు నాటి రోజులు ఇప్పుడు లేవు ' అని చిన్మయి పేర్కొంది. 

ఇదే సందర్భంలో తనకు జరిగిన అన్యాయాన్ని కూడా చిన్మయి లేవనెత్తారు. లిరిసిస్ట్ వైరాముత్తు తనను లైంగికంగా వేధించిన సమయంలో తన తల్లి అక్కడే ఉందని ఆమె గుర్తుచేసుకున్నారు.  తన తల్లి పక్కనే ఉన్నా సరే మగవారి బుద్ధి చూపించాడని వైరాముత్తు గురించి విరుచుకుపడింది. తనపై లైంగిక దాడి చేయమని కోరుకోలేదని, సినిమా ఛాన్సుల కోసమే తనతో కలిసి పనిచేశానంది. అతన్ని ఒక గురువుగా, పురాణ గీత రచయితగా గౌరవించానని ఆమె గుర్తుచేసుకుంది. 

చిరంజీవి చెప్పింది తప్పు.. సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్

సీనియర్ నటి షావుకారు జానకి వంటి వారు కూడా మీటూ ఉద్యమాన్ని అర్థం చేసుకోలేదని చిన్మయి వాపోయింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బాధితులను అవమానించారని గుర్తుచేసుకుంది. ఇండస్ట్రీ ఎప్పటికీ అద్దం లాంటిది కాదని,  ఇక్కడ పని కావాలంటే శరీరం ఇవ్వాల్సిందేనని దానిని కోరుకునే పురుషులే ఎక్కువ ఉన్నారని ఆమె తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement