సుప్రీం కోర్టులో విజయ్‌ సినిమాకు భారీ ఎదురు దెబ్బ | Supreme Court Refuses To Jana nayagan Producer Plea For CBFC Clearance | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో విజయ్‌ ‘జన నాయగన్’ కు భారీ ఎదురు దెబ్బ!

Jan 15 2026 11:38 AM | Updated on Jan 15 2026 12:31 PM

Supreme Court Refuses To Jana nayagan Producer Plea For CBFC Clearance

తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్‌ విజయ్‌ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’(Jana nayagan) కి సుప్రీం కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది.  సెన్సార్సర్టిఫికెట్‌ జారీకి స్టే విధించిన మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్‌ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ వేసిన పిటిషన్‌ని విచారించకుండానే హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తిరిగి పంపింది. ఈ నెల 20వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని మద్రాసు హైకోర్టుకు సూచించింది. 

ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఆలస్యమైంది. సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇవ్వకపోవడంతో, నిర్మాతలు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాకు వెంటనే సెన్సార్‌ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సిందిగా 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీబీఎఫ్‌సీని ఆదేశించింది. అనంతరం, కొద్ది గంటల్లోనే సీబీఎఫ్‌సీ వినతిపై స్పందించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. 

దీంతో చిత్ర నిర్మాతలు నెల 12 సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను ఎంటర్‌టైన్ చేయకుండా, హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తిరిగి పంపింది. హైకోర్టు జనవరి 20లోపు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement