పరిస్థితి మా చేయి దాటిపోయింది: నిర్మాత భావోద్వేగం | Jana Nayagan Producer Apologises to Fans: Vijay deserves Good farewell | Sakshi
Sakshi News home page

ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలీదు.. సారీ: జననాయగణ్‌ నిర్మాత

Jan 10 2026 4:34 PM | Updated on Jan 10 2026 4:40 PM

Jana Nayagan Producer Apologises to Fans: Vijay deserves Good farewell

తన సినిమాలతో దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నాడు హీరో విజయ్‌. ఇకపై ప్రజాసేవకే పరిమితం అవాలనుకున్న ఆయన జన నాయగణ్‌తో సినిమాలకు వీడ్కోలు పలకాలని భావించాడు. ఇదే తన చివరి చిత్రం అని ప్రకటించాడు. అభిమాన హీరోని చివరిసారి థియేటర్‌లో చూసుకుని సెలబ్రేట్‌ చేసుకునే రోజు కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూశారు. 

చివరి నిమిషంలో వాయిదా
కానీ సెన్సార్‌ సమస్య కారణంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో జన నాయగణ్‌ నిర్మాత వెంకట్‌ కె నారాయణ భావోద్వేగానికి లోనయ్యాడు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ.. జన నాగయణ్‌ సినిమాను 2025 డిసెంబర్‌ 18న సీబీఎఫ్‌సీకి పంపించాం. డిసెంబర్‌ 22న యూఏ 16+ సర్టిఫికెట్‌ ఇస్తామంటూ మాకు మెయిల్‌ చేశారు. 

సడన్‌గా ఓ ఫిర్యాదు
అలాగే కొన్ని మార్పులు చేయాలన్నారు. వాళ్లు సూచించినట్లుగా ఆ మార్పులు చేసి సినిమాను మళ్లీ సెన్సార్‌ బోర్డుకు పంపాం. సినిమా రిలీజ్‌కు మేమన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇంతలో సినిమాపై ఒక ఫిర్యాదు వచ్చిందని, దీన్ని రివైజింగ్‌ కమిటీకి పంపుతున్నామంటూ జనవరి 5న సెన్సార్‌ బోర్డు మెయిల్‌ చేసింది. ఆ ఫిర్యాదు ఏంటో? ఎవరు చేశారో? మాకు స్పష్టత లేదు. 

పరిస్థితి చేయిదాటింది
పైగా రివైజింగ్‌ కమిటీని సంప్రదించేందుకు సమయం మించిపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఏదేమైనా పరిస్థితి మా చేయిదాటిపోయింది. సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌.. అందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. కొన్ని దశాబ్దాలుగా అభిమానులను అలరించిన హీరో విజయ్‌కు మంచి వీడ్కోలు దక్కాల్సింది! అని విచారం వ్యక్తం చేశాడు.

అసలేంటి సమస్య?
భగవంత్‌ కేసరి సినిమాను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం జన నాయగణ్‌. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 9న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సీబీఎఫ్‌సీ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంలో జాప్యం చేసింది. దీంతో రిలీజ్‌కు మూడురోజుల ముందు చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. యు/ఎ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిందేనంటూ మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 

కోర్టు తీర్పుతో అటు చిత్రయూనిట్‌, ఇటు అభిమానులు సంతోషపడేలోపే మరో బాంబు పేలింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాస్‌ హైకోర్టు డివిజన్‌ బెంన్‌ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీపై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.

 

చదవండి: రాజాసాబ్‌.. అందుకే ఎవరికీ మా సినిమా ఎక్కలేదు: మారుతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement