మన శంకర వరప్రసాద్‌గారు మూవీ భారీ హిట్ కొట్టేసింది.. ఇదే ఊపులో చిరంజీవి- దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కానుంది. 'మెగా 158' వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో మొదలు కానుందని సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అయితే, విజయ్ నటించిన జన నాయగన్ వాయిదా ఎఫెక్ట్ చిరు మూవీపై పడనుందా అంటూ నెట్టింట అనేక ప్రశ్నలు కనిపిస్తున్నాయి.
జన నాయగన్ సినిమాను కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో చిరంజీవి మూవీతో ఎంట్రీ ఇవ్వాలని ఆ సంస్థ ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే మెగా 158 ప్రాజెక్ట్‌తో నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, నిషా వెంకట్ కొనంకి ఢీల్ కుదుర్చుకున్నారు. అయితే జన నాయగన్ సెన్సార్ గొడవ కారణంగా ఆ సంస్థ కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో చిరు- బాబీ సినిమా మరింత ఆలస్యం కానుందని వార్తలు వస్తున్నాయి.
వాస్తవంగా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సిన చిరంజీవి మూవీ.. జన నాయగన్ ఎఫెక్ట్ వల్ల మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. అయితే, అంత వరకు చిరు, బాబీ వేచి చూస్తారా..? అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ఇదే సమయంలో మరికొందరు అదంతా రూమర్స్ మాత్రమేనని తెలుపుతున్నారు. జన నాయగన్ వివాదం ఉన్నప్పటికీ చిరు వంటి స్టార్ హీరోతో వచ్చిన ఛాన్స్‌ను ఆ సంస్థ వదులుకోదని చెబుతున్నారు. అనుకున్న సమయానికే షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని ఫ్యాన్స్ తెలుపుతున్నారు.
‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత చిరు- బాబీ కాంబోలో ఈ మూవీ రానున్నడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా యాక్షన్ మోడ్‌లో ఉంటుందని తెలుస్తోంది. మెగాస్టార్ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో తెరపై కనిపిస్తారని టాక్.. ఇందులో చిరుతో పాటు మరో స్టార్ కూడా తెర పంచుకునే అవకాశమున్నట్లు ప్రచారం సాగుతోంది.


