breaking news
Sisindri
-
నా లైఫ్‌లో స్పెషల్ మూవీ అదే : అఖిల్ కామెంట్స్ వైరల్
లెనిన్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అక్కినేని హీరో అఖిల్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్.. ఎట్టకేలకు అయ్యగారే నంబర్‌వన్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది.లెనిన్ హిట్ కొట్టిన ఆనందంలో ఉన్న అఖిల్ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన చిన్నప్పుడు నటించిన సిసింద్రీ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా మొత్తం నా నిద్ర టైమ్ ఆధారంగానే తెరకెక్కించారని తెలిపారు. నేను ఏడవాలంటే కెమెరా వెనకాల నాన్న చేతులు ఊపేవారని అన్నారు. నేను ఏడ్చాలంటే అమ్మ బై చెప్పి కారులో వెళ్లిపోయేదని అఖిల్ వెల్లడించారు. ఇలా చిన్న చిన్న ట్రిక్స్‌తో నేను నటించానని.. అందుకే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిందన్నారు. నా లైఫ్‌లో ది మోస్ట్ యూనిక్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ సిసింద్రీ మూవీనేనని అఖిల్ ఆనందం వ్యక్తం చేశారు. నా జీవితంలో సిసింద్రీ మూవీ చాలా ప్రత్యేకమని తెలిపారు. -
నవ్వాలంటే నాన్న.. ఏడవాలంటే అమ్మ.. 'సిసింద్రీ' సంగతులు
అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. మూవీ హడావుడి అంతా ముగిసిపోవడంతో ఇప్పుడో ఓ యూట్యూబర్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన బోలెడు విషయాల్ని పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా నెలల వయసున్నప్పుడు తనతో తీసిన 'సిసింద్రీ' గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని సంగతులు షేర్ చేశాడు.(ఇదీ చదవండి: షాకింగ్.. అఖిల్ అక్కినేని ఇండియన్ కాదా?)'నాకే గనక కొడుకు పుడితే సిసింద్రీ-2 చేస్తాను. ఈ విషయాన్ని నా భార్య జైనాబ్కి కూడా చెప్పాను. నాకు కొడుకు పుడతాడా? కూతురు పుడతుందా? అనేది దేవుడి చేతుల్లో ఉంది. ఒకవేళ కొడుకు పుడితే మాత్రం తనని పెట్టి సిసింద్రీ 2' తీయాలనేది నా ఆలోచన. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో నేను నాలుగు గంటల మాత్రమే మెలకువగా ఉండేవాడిని. ఆ టైంలో నా మూడ్ బాగుంటేనే షూటింగ్ చేసేవారు. సినిమాలో నేను నవ్వాల్సిన సందర్భంలో కెమెరా వెనక నాన్న నిలబడి సైగలు చేసేవారు. వాటిని చూసి నేను నవ్వేవాడిని. ఏడవాల్సిన సీన్స్ కోసం అమ్మ కారు ఎక్కి వెళ్లిపోయేది. అది చూసి నేను ఏడిస్తే ఆ సీన్స్ షూటింగ్ చేసేవారు' అని అఖిల్ పాత విషయాల్ని చెప్పుకొచ్చాడు.'సిసింద్రీ' సినిమాని హాలీవుడ్ సినిమా.. 'బేబీస్ డే ఔట్' ఆధారంగా తెరకెక్కించారు. శివనాగేశ్వరరావు దర్శకుడు కాగా నాగార్జున నిర్మించడంతోపాటు ఇందులో కీలక పాత్ర చేశాడు. ఈ మూవీ కమర్షియల్‌గా హిట్ అయింది. అఖిల్‌కి ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రంతో వచ్చిన లాభాలతోనే అమల.. తనకు ఎంతో ఇష్టమైన జంతు సంరక్షణ సంస్థ 'బ్లూ క్రాస్'ను ప్రారంభించారని అఖిల్ చెప్పాడు.'సిసింద్రీ' విషయానికొస్తే.. ఓ డబ్బింటి కుటుంబానికి చెందిన చిన్న పిల్లాడిని.. డబ్బుల కోసం తన బాబాయి కిడ్నాప్ చేయిస్తాడు. అందులో భాగమైన ముగ్గురు దొంగల్ని ఆ చిన్నపిల్లాడు ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు? తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు ఎలా చేరుకున్నాడు అనేది స్టోరీ. పూర్తిగా ఎంటర్టైనింగ్గా ఉండే ఈ సినిమాలో ఎంతో ముద్దుగా కనిపిస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన అఖిల్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు.(ఇదీ చదవండి: నన్ను చూసి నాకే అసహ్యమేసింది: అఖిల్) -
పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్
హాస్యనటిగా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ప్రేక్షకులను దగ్గరైన నటి పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంలో బాధపడుతున్నారు. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలతో పావలా శ్యామల పరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో పావలా శ్యామల పరిస్థితిని తెలుసుకొని ఆమెకు సహాయం చేయడానికి సిసింద్రీ డైరెక్టర్ శివ నాగేశ్వర రావ్ ముందుకు వచ్చారు. తన వంతు సహాయంగా ఆమెకు 50వేల రూపాయలను అందించారు. ఆయన తరుపు వాళ్లు వచ్చి పావలా శ్యామలకు ఆ డబ్బును అందించారు. అనారోగ్యం సమస్యలతో సినిమాలకు దూరమైన ఆమె హైదరాబాద్‌లోని ఓ చిన్న ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఇటీవలె పావలా శ్యామల ఇబ్బందులు తెలుసుకున్న నటి కరాటే కల్యాణి ఆమెను కలిసి తన వంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అలాగే మా అసోసియేషన్ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరు పావలా శ్యామలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు సహాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. ఇక ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్ హోటల్, గోలీమార్ వంటి సూపర్ చిత్రాల్లో నటించి పావలా శ్యామల గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. గతంలో మెగాస్టార్ చిరంజీవి రూ.2 లక్షలు పంపించారని, తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారని అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందారు. గత మూడు నెలలు ఇంటి అద్దె కూడా కట్టలేదని వాపోతున్నారు శ్యామల. చదవండి : పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో.. -
కన్ఫామ్ : అఖిల్ సినిమాలో సీనియర్ హీరోయిన్
తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్ లో టబు పై సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు. మనం, 24 సినిమాల ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. గతంలో నాగ్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటి అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్టైన్ చేస్తోంది. అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. అయితే టబు చేస్తుంది తల్లి పాత్రే అయినా..అది హీరో తల్లి పాత్రనా.. లేక హీరోయిన్ తల్లి పాత్రనా తెలియాల్సి ఉంది. -
అఖిల్ చిత్రంలో?
‘ఆటాడుకుందాం రా అందగాడా...’ అంటూ ‘సిసింద్రీ’ సినిమాలో నాగార్జునతో టబు హుషారుగా డ్యాన్స్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఊహే తెలియని వయసులో అఖిల్ ఆ సినిమాతో ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఇక నాగ్ సరసన టబు ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మళ్లీ అఖిల్ సినిమాలో నటించనున్నారట. ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ ద్వితీయ చిత్రం ఉంటుందని నాగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఉన్న ఓ కీలక పాత్ర కోసం టబూని సంప్రదించడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని భోగట్టా. -
అఖిల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ
తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కథా కథనాలను ఫైనల్ చేసిన ఈ యంగ్ హీరో, త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. ప్రస్తుతం తన నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉన్న అఖిల్, జనవరి నుంచి కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లోనే హీరోయిన్గా పరిచయం అయిన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తరువాత నాగ్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటి అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్టైన్ చేస్తోంది. అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌కు రెడీ అవుతోంది. నాగార్జున స్వయంగా అడగటంతో టబు ఈ పాత్రకు అంగీకరించిందన్న ప్రచారం జరుగుతోంది.


