అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి | Amma Naaku Aa Abbai Kaavali Movie Latest News | Sakshi
Sakshi News home page

డాక్టర్ కమ్ హీరో.. వినోదం అందించాలనేదే నా ధ్యేయం

Jul 25 2026 8:17 PM | Updated on Jul 25 2026 8:21 PM

Amma Naaku Aa Abbai Kaavali Movie Latest News

పవన్ మహావీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి'. పవన్ లండన్‌లో డాక్టర్ కోర్స్ చేస్తూ హీరోగా నటించాడు. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు, దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్.ఆదిత్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ట్రైలర్ బాగుందని, పవన్ మహావీర్‌కి ఇది పరిచయ చిత్రమంటే నమ్మడం కష్టమని అతిధులు పేర్కొన్నారు. నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్‌కి ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement