'త్రికాల'ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దిన పవన్ చెన్నా | Trikala Movie Cinematographer Pavan Chenna | Sakshi
Sakshi News home page

'త్రికాల'ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దిన పవన్ చెన్నా

Jul 25 2026 8:26 PM | Updated on Jul 25 2026 8:26 PM

Trikala Movie Cinematographer Pavan Chenna

కెమెరా భాషని మాయాజాలంగా మార్చగల సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా. మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ సినిమా 'త్రికాల' ద్వారా ఆయన తన ప్రతిభను మరో స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి ఈయన గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో, సనాతన ధర్మ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. మణి తెల్లగూటి దర్శకత్వంలో, రాధిక–శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు.

సమకాలీన తెలుగు సినిమాలో సరికొత్త విజువల్ ట్రెండ్స్ సెట్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్లలో పవన్ చెన్నా ఒకరు. కేవలం నటీనటులను చూపించడమే కాకుండా, ప్రతి ఫ్రేమ్‌లోనూ లోతైన భావోద్వేగాలను పలికించడం ఆయన శైలి. మైథాలజీని ఒక మహా కావ్యంలా స్క్రీన్ పై ఆవిష్కరించారు. లార్జర్ ద్యాన్ లైఫ్ కంపోజిషన్స్, పక్కా ఫ్రేమింగ్, ఇన్ డెప్త్ విజువల్స్ ఆడియన్స్‌ని కట్టిపడేశాయి. లైటింగ్, షాడోల‌తో స్క్రీన్ పై అద్భుతమైన డ్రామా క్రియేట్ చేశారు. హై కాంట్రాస్ట్ డ్రామా లైటింగ్ సెటప్స్ సినిమాలోని సూపర్ నేచురల్ టెన్షన్‌ను, హాంటింగ్ అట్మాస్పియర్‌ను పీక్స్‌కి తీసుకెళ్లాయి.

ప్రతి ఫ్రేమ్ ఒక కథ చెప్పాలి... ప్రతి విజువల్ ప్రేక్షకుల్లో ఒక భావోద్వేగాన్ని కలిగించాలి అనే నమ్మకంతోనే నేను సినిమాటోగ్రఫీ చేస్తాను. నా దృష్టిలో కెమెరా అనేది కేవలం చిత్రాలను బంధించే సాధనం కాదు దర్శకుడు ఊహించిన ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే భాష. 'త్రికాల' వంటి మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో సనాతన ధర్మం, దైవత్వం, మిస్టరీని విజువల్‌గా ఆవిష్కరించడం నాకు ఒక పెద్ద సవాల్‌గా అనిపించింది. నా పనిని ప్రశంసించడం ఒక సినిమాటోగ్రాఫర్‌గా నాకు ఎంతో సంతోషాన్ని, మరింత బాధ్యతను ఇచ్చిందని పవన్ చెన్నా చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement