breaking news
trikala Movie
-
ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసినవి కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తుంటాయి.ఇప్పుడు అలానే ఓ తెలుగు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)మాస్టర్ మహేంద్రన్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'త్రికాల:స్క్రిప్ట్ ఆఫ్ గాడ్'. ఈ ఏడాది మే 28న థియేటర్లలోకి వచ్చింది. కానీ స్టార్స్ లేకపోవడం వల్ల దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడీ చిత్రం గురువారం(జూలై 09) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాటిక్ యూనివర్స్‌గా రూపొందుతున్న దానిలో తొలి భాగం ఇది.'త్రికాల' విషయానికొస్తే.. ఓ రాజ వంశీకుల కుటుంబానికి తరతరాలుగా శాపం ఉంటుంది. దీని కారణంగా చీకటిలో తప్ప సూర్యుడు వెలుగు చూడలేని వైతరణ్(అజయ్) పుడతాడు. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో సవతి తల్లి (ఆమని) ఇతడిని పెంచుతుంది. ఇతడి జీవితంలో అనుహ్య సంఘటనలు జరుగుతాయి. సైకలాజికల్ బైపోలార్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్న వైతరణ్కి వైద్యం చేయడం కోసం సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధాదాస్) రంగంలోకి దిగుతుంది.ఈ క్రమంలో వైతరణ్ జీవితానికి సంబంధించి ఆమెకు ఎలాంటి విషయాలు తెలిశాయి? శంకరంపల్లి ఊరిలో కాటేరమ్మ తల్లి పేరుతో చోటు చేసుకున్న సంఘటనలు ఎలాంటివి? వైతరణ్ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం వెనుక కథేంటి? శివ (మాస్టర్ మహేంద్రన్), నిధి (సాహితి అవంచ) జంటకు వైతరణ్కీ మధ్య సంబంధం ఏమిటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా 'మాలీవుడ్ టైమ్స్' తెలుగు రివ్యూ)(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ 'త్రికాల' రివ్యూ
కొత్త తరహా మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ కథతో తీసిన సినిమా 'త్రికాల'. శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రధారి. మణి తెల్లగూటి దర్శకుడు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ, తాంత్రిక శక్తులు, మానసిక భయం, మానవ భావోద్వేగాలను తదితర అంశాలతో దీన్ని తీశారు. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)కథేంటి?శతాబ్దాల క్రితం కుమారి ఖండం అనే ప్రాంతంలో కొందరు ఋషులు.. శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలు, ప్రాచీన రహస్యాలను ఓ రహస్య ప్రదేశంలో దాచిపెడతారు. వాటిని రక్షించేందుకు ఓ ఆయుధాన్ని సృష్టించి, దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులపై పోరాడుతూ అతడు మరణించగా, మునులు అతని ఆత్మను ఒక మాయా అండంలో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి భారీ ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని వారు చెబుతారు. ప్రస్తుతానికొస్తే శివ (మాస్టర్ మహేంద్రన్) కనిపించకుండా పోయిన తన ప్రేయసి నిధి (సాహితి) కోసం సిటీకి వస్తాడు. ఇతడి జీవితంలోకి వైతరణ్ వస్తాడు. నిజానికి ఇతడు పునర్జన్మ ఎత్తిన త్రికాలవర్మ. ఇతడి ఆత్మ ఓ బంగ్లాలోనే సంచరిస్తూ ఉంటుంది. సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ఆ ఇంట్లో చిక్కుకుపోతుంది. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'త్రికాల' రొటీన్ హారర్ సినిమా కాదు. మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ, విజువల్ థ్రిల్లర్ తదితర అంశాలతో తీశారు. పౌరాణిక రహస్యాలు, కర్మ సిద్ధాంతం, డార్క్ ఫాంటసీ లాంటివి బాగానే కుదిరాయి. కర్మ సిద్ధాంతాన్ని కేవలం డైలాగ్స్ రూపంలో కాకుండా, పాత్రలతో చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. పౌరాణికతని ఆధునిక ప్రపంచంతో మిక్స్ చేసి చూపించారు.అలానే వైతరణ్ పాత్రలో అజయ్, శివగా మాస్టర్ మహేంద్రన్, సైకియాట్రిస్ట్‌గా శ్రద్ధా దాస్ పాత్రలకు తగ్గట్లు నటించారు. మిగిలిన పాత్రధారులు తమ వంతు న్యాయం చేశారు. దర్శకుడు మణి తెల్లగూటి కూడా మెప్పించాడు. సినిమాటోగ్రాఫర్ పవన్ తనదైన కెమెరా మ్యాజిక్ చేశారు. థ్రిల్లింగ్ మూడ్ తీసుకొచ్చారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ సినిమాకు సెట్ అయింది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించింది. మాయా అండం, అసుర శక్తులు, ఆధ్యాత్మిక యుద్ధాలు, ప్రాచీన ప్రపంచాల డిజైన్ తదితర విజువల్స్ ఆకట్టుకున్నాయి.(ఇదీ చదవండి: 'బ్లాస్ట్ జోన్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
సనాతన ధర్మం, మైథలాజికల్ టచ్‌తో శ్రద్ధాదాస్ ‘త్రికాల’
టాలీవుడ్లో ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన శ్రద్ధాదాస్, ‘ఆర్య 2’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ‘త్రికాల’లో మరో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాధిక–శ్రీనివాస్ నిర్మించగా, చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్పీ(LLP) ప్రపంచవ్యాప్తంగా మే 28న విడుదల చేస్తోంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా అడవి నేపథ్యంలో రూపొందించిన విజువల్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది కేవలం సాధారణ హారర్ చిత్రం కాకుండా దైవిక శక్తులు, అతీత శక్తుల మధ్య జరిగే సస్పెన్స్‌భరితమైన మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…‘ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే ఒక శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ సాగుతుంది. సనాతన ధర్మంలోని కొన్ని ఆధ్యాత్మిక అంశాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని అందిస్తుంది’ అని తెలిపారు.నిర్మాతలు మాట్లాడుతూ…‘మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, థ్రిల్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘త్రికాల’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది’అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. -
‘త్రికాల’గా వస్తున్న శ్రద్ధాదాస్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్బి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతుంది.ఇటీవలి కాలంలో మైథలాజికల్ టచ్‌తో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ‘త్రికాల’పై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన హైక్వాలిటీ వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్ఫుల్ పాత్ర, శ్రద్ధాదాస్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…“ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి తెరకెక్కించాం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ‘త్రికాల’ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.నిర్మాతలు మాట్లాడుతూ… సరికొత్త కాన్సెప్ట్‌తో, మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ‘త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆసక్తి.. వంటి అంశాలు కలిసిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది’ అని పేర్కొన్నారు.ఈ సినిమాకు హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.


