గుర్తుందా? సరిగ్గా పదేళ్ల క్రితం 'ఫ్రీడమ్ 251' పేరుతో ఓ స్కామ్ జరిగింది. అంటే రూ.251 చెల్లిస్తే స్మార్ట్ ఫోన్ ఇస్తామని నమ్మబలికించారు. తర్వాత ఇదో పెద్ద మోసమని తేలింది. ఇప్పుడీ కాన్సెప్ట్ ఆధారంగా తెలుగులో తీసిన టెక్ థ్రిల్లర్ సిరీస్ 'ఆజాదీ 501'. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది చెప్పేశారు.
(ఇదీ చదవండి: 3 వారాలలోనే ఓటీటీలోకి నాగదుర్గ కొత్త సినిమా)
వచ్చే బుధవారం(జూలై 29) నుంచి ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తేజ, హర్షవర్ధన్, శశాంక్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. ట్రైలర్ బట్టి చూస్తే రూ.20 వేల సంపాదించే ఓ మధ్య తరగతి కుర్రాడు, ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఎవరి నుంచి ప్రోత్సాహం ఉండదు. అలాంటి కుర్రాడికి రూ.501 ఫోన్ ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చింది? తర్వాత ఏమైంది? ఇందులో స్కామ్ ఏంటి? అనేది స్టోరీలా అనిపిస్తుంది.
ట్రైలర్ అయితే పర్లేదనిపించేలా ఉంది. నటీనటులు కూడా మొత్తం తెలుగువాళ్లే. మరి ఇది ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది చూడాలి? ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. వీటిలో నాగబంధం, పురుషః లాంటి తెలుగు చిత్రాలతో పాటు కాన్ సిటీ, పల్లిచట్టంబి లాంటి డబ్బింగ్ మూవీస్.. ఆదర్శ బాలవిద్యాలయ లాంటి సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)


