breaking news
jai krishna
-
20 రోజులకే ఓటీటీలోకి సూపర్ స్టార్ వారసుడి సినిమా!
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. జులై 30న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఆగస్ట్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సంస్థ ఎక్స్ వేదికగా వెల్లడించింది.‘శ్రీనివాస మంగాపురం’కథేంటంటే..పెద్దిరెడ్డి(‘కిక్’శ్యామ్).. తిరుపతిలో మంచి పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా జనాలు భయపడిపోతారు. అలాంటి వ్యక్తి కూతురు మంగ(రాషా తడాని)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీనివాస్(జై కృష్ణ). అతనికి తిరుపతి కొత్త. జులాయిగా తిరిగే స్వతంత్ర బాబు(నరేశ్)తో స్నేహం ఏర్పరచుకొని మంగ చుట్టూ తిరుగుతుంటాడు. మంగ మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మంగకు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. అయినా కూడా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్. ఆమె రిజెక్ట్ చేసినా..వదిలిపెట్టడు. ఎందుకలా? అసలు శ్రీనివాస్ ఎవరు? తిరుపతి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడా? వాసుబాబు ఎవరు? బళ్లారి డాన్ వెంకటప్పయ్యనాయుడు(మోహన్ బాబు)తో శ్రీనివాస్‌కి ఉన్న సంబంధం ఏంటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? చివరకు మంగ, శ్రీను ఎలా కలిశారు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.The MOST INTENSE LOVE STORY of the Season is Coming Home ❤️🔥#SrinivasaMangapuram Streaming on @PrimeVideoIN from Tomorrow, August 20th 🔥#JaiKrishnaGhattamaneni #RashaThadani @themohanbabu @DirAjayBhupathi @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @sahisuresh @gullapallikumar… pic.twitter.com/gAmL53yUru— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 19, 2026 -
సినిమా ఫ్లాప్‌ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
తెలుగులో ప్రతివారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయ్యేవి చాలా తక్కువగానే ఉంటాయి. కాకపోతే తమ మూవీ ఫ్లాప్ అయింది లేదంటే జనాలకు నచ్చలేదని విషయాన్ని దర్శకులు బహిరంగంగా ఒప్పుకోరు. కానీ డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం ట్వీట్ చేశాడు. పూర్తి బాధ్యత తనదేనని రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: నటికి చేదు అనుభవం.. లిప్ కిస్ పెట్టిన లేడీ ఫ్యాన్)మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు జైకృష్ణ హీరోగా చేసిన తొలి సినిమా 'శ్రీనివాస మంగాపురం'. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కానీ తీసికట్టు కథాకథనాల కారణంగా తొలిరోజే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. జైకృష్ణ యాక్టింగ్ పర్లేదనిపించినప్పటికీ ఓల్డ్ స్కూల్ తరహా మూవీ కావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ క్రమంలోనే తాజాగా అజయ్ భూపతి ట్వీట్ చేశాడు.'శ్రీనివాస మంగాపురం నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎన్నో భావోద్వేగాలను, మధురమైన జ్ఞాపకాలను అందించింది. వాటిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. జై కృష్ణ, రషా తడానీతో పనిచేస్తున్నప్పుడు వారు కొత్తవాళ్లనిపించలేదు. బాగా నటించారు. అశ్వనీదత్ గారితో కలిసి పనిచేయడం కూడా నాకు దక్కిన గొప్ప గౌరవం. కిరణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ మూవీ ఫలితానికి సంబంధించిన పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా. త్వరలోనే మళ్లీ పుంజుకుని, మీ అందరికీ నచ్చే చిత్రంతో మీ ముందుకు వస్తా' అని అజయ్ భూపతి ట్వీట్ చేశాడు.ఈ దర్శకుడు కెరీర్ విషయానికొస్తే 'ఆర్ఎక్స్ 100'తో సెన్సేషన్ హిట్ అందుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత 'మహాసముద్రం'తో డిజాస్టర్ అందుకున్నాడు. మళ్లీ 'మంగళవారం' క్రేజీ మూవీ తీసి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు 'శ్రీనివాస మంగాపురం'తో ఫెయిల్యూర్ చవిచూశాడు. కాకపోతే ఫ్లాప్ ని కూడా నిజాయతీగా అంగీకరించాడు.(ఇదీ చదవండి: ‘శ్రీనివాస మంగాపురం’మూవీ రివ్యూ)#SrinivasaMangapuram is a very special film for me. It has given me so many emotions and memories that I will always cherish.Working with #JayaKrishna & #Rasha never felt like working with newcomers... they gave their best. Working with #AshwiniDutt Garu was also a great…— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 8, 2026 -
శ్రీనివాస మంగాపురం హిట్టా? పట్టా?
-
Public Talk : మొదటి సినిమాతోనే 100 కోట్లు పక్కా... ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ మహేష్ బాబుని దింపేశాడు
-
‘శ్రీనివాస మంగాపురం’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ‘శ్రీనివాస మంగాపురం’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(జులై 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పెద్దిరెడ్డి(‘కిక్’శ్యామ్).. తిరుపతిలో మంచి పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా జనాలు భయపడిపోతారు. అలాంటి వ్యక్తి కూతురు మంగ(రాషా తడాని)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీనివాస్(జై కృష్ణ). అతనికి తిరుపతి కొత్త. జులాయిగా తిరిగే స్వతంత్ర బాబు(నరేశ్)తో స్నేహం ఏర్పరచుకొని మంగ చుట్టూ తిరుగుతుంటాడు. మంగ మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మంగకు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. అయినా కూడా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్. ఆమె రిజెక్ట్ చేసినా..వదిలిపెట్టడు. ఎందుకలా? అసలు శ్రీనివాస్ ఎవరు? తిరుపతి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడా? వాసుబాబు ఎవరు? బళ్లారి డాన్ వెంకటప్పయ్యనాయుడు(మోహన్ బాబు)తో శ్రీనివాస్‌కి ఉన్న సంబంధం ఏంటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? చివరకు మంగ, శ్రీను ఎలా కలిశారు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.ఎలా ఉందంటే..సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడంటే కచ్చితంగా ఆ సినిమాపై అంచనాలు ఉంటాయి. అందుకే ‘శ్రీనివాసమంగాపురం’ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డారు. అజయ్ భూపతి బలమైన కథతోనే ఘట్టమనేని వారసుడిని పరిచయం చేస్తాడేమో అనుకున్నారు. కానీ రొటీన్ కమర్షియల్ స్టోరీతో జై కృష్ణని లాంచ్ చేశాడు.వాస్తవానికి స్టార్ హీరోల వారసుల ఎంట్రీ దాదాపు ఇలాంటి కమర్షియల్ చిత్రాలతోనే ఉంటుంది. తొలి చిత్రంతోనే మాస్‌గా నిలబడే ప్రయత్నం చేస్తారు. జై కృష్ణ కూడా అదే చేశాడు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. వైవిధ్యమైన కథలనే ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘శ్రీనివాసమంగాపురం’ కథకు ఓకే చెప్పి జై కృష్ణ పెద్ద సాహసమే చేశాడు.ఇక దర్శకుడు అజయ్ భూపతి కూడా బలమైన కథను కాకుండా.. కమర్షియల్ ఎలిమెంట్స్‌ని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ హీరోకు కావాల్సిన లవ్, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలన్నీ ఇందులో ఉన్నాయి. కానీ వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ప్రేమ కథను కూడా గుండెలకు హత్తుకునేలా చూపించలేదు. ఓ యాక్షన్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెద్దిరెడ్డి పాత్ర పరిచయం.. హీరో, హీరోయిన్ల ఎంట్రీ ఇలా చకచకగా జరిగిపోతుంది. హీరో.. హీరోయిన్ని చూడగానే పాట.. ఒక్కసారి మాట్లాడగానే మరో పాట.. కాసేపటికి ఇంకో పాట..ఇలా మొదటి 40 నిమిషాల్లోనే మూడు పాటలు వచ్చి.. చిరాకు తెప్పిస్తాయి. లవ్ సీన్స్ కూడా రొటీన్‌గానే సాగుతాయి.అయితే స్వతంత్ర బాబు పాత్ర ఎంట్రీ, ఆయన చేసే కామెడీ కొంతవరకు ఎంటర్టైన్ చేస్తాయి. మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా పర్వాలేదు. హీరోయిన్ వెనుక హీరో పడడం.. ఆమె కూడా ఇతన్ని తెలిసిన వ్యక్తిలా చూడడం.. ప్లాష్‌బ్యాక్‌లో ఏదో ఉంటుందనే క్యూరియాసిటీతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ఇది రొటీన్ లవ్‌స్టోరీ అని అర్థమైపోతుంది. గతంలో చూసిన చాలా సినిమాలు గుర్తుకు వచ్చేలా సన్నివేశాలు సాగుతుంటాయి. క్లైమాక్స్ కూడా అలానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. తొలి సినిమానే అయినా జై కృష్ణ చక్కగా నటించాడు. లుక్స్ పరంగానూ తెరపై చూడడానికి బాగున్నాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు డ్యాన్స్ కూడా బాగానే చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం అనుభవలేమి కనిపించింది. రెండు, మూడు సినిమాలు పడితే.. నటుడిగా మరింత రాటుదేలుతాడు. మంగ పాత్రకి రాషా తడాని న్యాయం చేసింది.ఇక మోహన్ బాబు తెరపై కనిపించేది కాసేపే అయినా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కిక్ శ్యామ్, అజయ్, వాసుకితో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటల్లో 'అల్లల్లే...' ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
జయకృష్ణ శ్రీనివాస మంగాపురం.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ మూవీలో రషా తడానీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఉక్కిరి బిక్కిరి’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. హరి చరణ్ ఆలపించారు. ఈ సాంగ్ జీవీ ప్రకాశ్‌కుమార్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. -
నాపై ఒత్తిడి ఉండటం మంచిదే!: జై కృష్ణ
‘‘నేను ఫ్యాన్స్‌కి ఇంకా ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ వాళ్లు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేనీ సినిమా చేస్తున్నానని తెలియక ముందు నుంచే ఘట్టమనేని అభిమానులు నన్ను స పోర్ట్ చేశారు. అందుకే నటుడిగా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి... నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలి. మంచి కథలు, మంచి పాత్రలు చేయాలనే ఆలోచన నాకు మొదట్నుంచే ఉంది. ఈ విషయంలో నాపై ఒత్తిడి ఉండటం మంచిదే.అది నన్ను మంచి కథల వైపు తీసుకువెళ్తుంది’’ అని జై కృష్ణ అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు సోదరుడు రమేష్‌బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిం చారు. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో జై కృష్ణ చెప్పిన సంగతులు... ⇒ నా 16 ఏళ్ల వయసులో యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత శిక్షణ తీసుకోవడం ప్రారంభించాను. రెండేళ్లు ముంబై, తర్వాత పాండిచ్చేరి, నెక్ట్స్ న్యూయార్క్ వెళ్లి యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత ఇండియా వచ్చి కథలు వినడం ప్రారంభించాను. కొన్ని కథలు విన్న తర్వాత, నిర్మాత పి. కిరణ్‌గారి ద్వారా దర్శకుడు అజయ్ భూపతిగారిని కలిశాను. అజయ్‌గారు చెప్పి కథ నచ్చడంతో, ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా చేశాను. మంచి క్యారెక్టరైజేషన్, మంచి ఎమోషన్‌తో కూడిన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాను. నేను అనుకున్న అంశాలు ఈ కథలో కుదిరాయి. ఈ చిత్రం కోసం అజయ్‌గారు 3 నెలలు వర్క్‌షాప్ చేయించారు. లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్, డైలాగ్స్... ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ అయ్యాం. ⇒ ఇందులో నేను శ్రీను అనే రోల్ చేశాను. శ్రీనుకి కాస్త అల్లరితనం ఉంటుంది. కానీ తనకేం కావాలో తనకి స్పష్టంగా తెలుసు. తను మంగను (రాషా తడానీ) ప్రేమిస్తాడు. ఆ తర్వాత కథ ఎలా సాగుతుంది? అన్నదే మిగిలిన సినిమా కథాంశం. ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ సినిమా కాదు. ఈ చిత్రంలో బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. ట్విస్ట్‌లు కొత్తగా ఉంటాయి. అజయ్‌గారు క్లారిటీ ఉన్న దర్శకుడు. అశ్వినీదత్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. వైజయంతి మూవీస్‌లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో లాంచ్ కావడం హ్యాపీగా ఉంది. బాబాయ్ (మహేశ్‌బాబు) తొలి సినిమా కూడా ఈ బ్యానర్లోనే రూపొందింది.⇒ నాకు ఫ్యామిలీ స పోర్ట్ ఉంది. నా ప్రతి అడుగులో బంగారు తాతయ్య (కృష్ణ సోదరుడు–నిర్మాత ఆదిశేషగిరి రావు) ్ర పోత్సాహం ఉంది. నేను సినిమాల్లోకి రావాలని, మంచి నటుడిగా ఎదగాలని మా తాతయ్య (కృష్ణ)గారు కోరుకున్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు సినిమాల గురించి చర్చించుకునేవాళ్లం. నేను యాక్టర్ కావాలనుకున్న తర్వాత బాబాయ్ సలహాలు, సూచనలు ఇచ్చారు. దర్శకుడు విజన్‌కు తగ్గట్లు యాక్ట్ చేయాలని చె΄్పారు. అలాగే ‘శ్రీనివాస మంగాపురం’ చూసి, హ్యాపీ ఫీలయ్యారు. ఈ సినిమా ఆయనకు నచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, సాంగ్స్ చాలా నచ్చాయని చె΄్పారు. స్క్రీన్‌పై డిఫరెంట్‌గా కనిపిస్తున్నావని, క్యారెక్టర్లోకి పూర్తిగా వెళ్లి పోయావని చె΄్పారు. ⇒ నా చిన్నతనంలో నేను సినిమా వాతావరణానికి దూరంగా ఉండి చదువుకునేవాడిని. మొదటిసారి ‘నిజం’ సినిమా షూటింగ్‌కు వెళ్లాను. ఇందులో చైల్డ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ‘అర్జున్’ షూటింగ్‌కు వెళ్లాను. ఈ చిత్రానికి మా నాన్నగారు నిర్మాత. ‘గుంటూరు కారం’ షూటింగ్‌కు వెళ్లాను. ఒక యాక్టర్‌గా నాకు విభిన్న జానర్స్‌లో సినిమాలు చేయాలని ఉంది. కానీ యాక్షన్ సినిమాలు చేయడం ఎక్కువ ఇష్టం. నేను యాక్టర్‌ని కావాలనుకున్నప్పుడే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. -
ట్రంప్ వీరవిధేయుడి నోట ‘జై శ్రీ కృష్ణ’
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. భారతీయ మూలాలను, సంప్రదాయాలను, విలువలనూ పాటించే వ్యక్తులు తరచూ తారసపడుతుంటారు. అది ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా!. అలాంటి వాళ్లలో ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి నామినీ అయిన కశ్యప్ పటేల్ ఒకరు. తాజాగా ఆయన చేసిన చర్య ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.44 ఏళ్ల కశ్యప్ క్యాష్ పటేల్.. తాజాగా(గురువారం) సెనేట్ జ్యూడీషియరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో తనకు మద్ధతు తెలపడానికి సుదూరాల నుంచి వచ్చిన తల్లి అంజనా, తండ్రి, సోదరిని కమిటీకి ఆయన పరిచయం చేశారు. చివర్లో ‘జై శ్రీ కృష్ణ’ అంటూ ముగించారు. అంతకు ముందు.. కమిటీ విచారణ ప్రారంభానికి ముందు ఆయన తన తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.WATCH | FBI Director-Designate Kashyap Patel delivers opening statement at confirmation hearing, thanks his parents who flew from India and concludes with “Jai Shri Krishna.”#FBI #KashyapPatel #US pic.twitter.com/mFLx0uEVAz— Organiser Weekly (@eOrganiser) January 30, 2025విచారణ ఎందుకంటే..ఎఫ్‌బీఐ డైరెక్టర్ నామినీ అయిన కశ్యప్ పటేల్‌ను సెనేట్ జ్యూడీషియరీ కమిటీ విచారణ జరుపుతుంది. సాధారణంగా ఈ కమిటీ ఆ పదవికి నామినీకి ఉన్న అర్హతలను సమీక్షించడంతో పాటు గతంలో చేసిన వ్యాఖ్యలను, వివాదాస్పద చర్యలను పరిశీలిస్తుంది. చివరకు సదరు నామినేషన్‌ను అంగీకరించాలా? తిరస్కరించాలా? అనేది ఈ కమిటీ చేతుల్లోనే ఉంటుంది.ఇక విచారణలో భాగంగా గతంలో.. జర్నలిస్టులను ప్రాసిక్యూషన్ చేయాలని, ఎఫ్‌బీఐ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేయాలని కశ్యప్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ట్రంప్‌ను ఆయనకు ఉన్న అనుబంధంపైనా ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. వీటితో పాటు జాత్యహంకారానికి గురయ్యారా?అనే ప్రశ్నకు.. ఆయన అవుననే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘గతంలో నేనూ గతంలో జాత్యహంకారానికి గురయ్యాను. అమెరికాలో ఎలాంటి హక్కు లేని ఓ వ్యక్తిగా నన్ను పేర్కొనేవారు. మీరు ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్లిపోవాలంటూ నాకు మెసేజ్‌లు వచ్చేవి. చట్టాన్ని కాపాడుతున్న ఎంతోమంది వ్యక్తులు ఎదుర్కొంటున్న దానితో పోలిస్తే నాకు జరిగింది చాలా చిన్నదిగా అనిపించింది. నా కుటుంబసభ్యులు ఇక్కడ ఉండగా.. ఆ సంఘటనను గురించి పూర్తిగా వెల్లడించలేను’’ అని పటేల్ అన్నారు. కాష్ పటేల్ గురించి..ట్రంప్‌కు వీరవిధేయుడిగా కాష్ పటేల్‌కు పేరుంది. గుజరాత్లో ఈయన కుటుంబమూలాలు ఉన్నాయి. ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అయితే ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా కాష్ తండ్రి అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. ప్రస్తుతం ఆయన కొలంబియాలో ఉంటున్నారు. కాష్ పటేల్ పూర్తి పేరు.. కశ్యప్ ప్రమోష్ వినోద్ పటేల్. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్లో చేరారు.కాష్ పటేల్‌ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్‌కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో ఈయన పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్‌లో లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు కూడా. ట్రంప్ రహస్య పత్రాల వ్యవహారం విచారణ సమయంలోనూ ఈయన పేరు ప్రముఖంగానే వినిపించింది. అయితే..ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక.. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి కొత్త చీఫ్ ఎవరవుతారనే చర్చ నడిచింది. ఆ సమయంలో రేసులో కాష్ పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అమెరికా మాజీ గూఢచారి జాన్ రాట్క్లిఫ్ ఆ అవకాశం దక్కించుకున్నారు. చివరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ పదవికి ఆయన పేరును ట్రంప్ నామినేట్ చేశారు. సెనేట్ కమిటీ గనుక ఆయన పేరుకు క్లియరెన్స్ ఇస్తే.. దాదాపుగా ఆయనకు అగ్రరాజ్య దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ పగ్గాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. భారతీయ మూలాలు ఉన్న కాష్ పటేల్ చరిత్ర సృష్టించినట్లే!. -
పగ, ప్రతీకారాల వన్మం
వ్యక్తిగత పగ, ప్రతీకారాల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం వన్మం అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు జై కృష్ణ. తాజాగా ఆర్య, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న పొరంబోకు, నకుల్, దినేష్ నటిస్తున్న తమిళుక్కు ఎన్ ఒండ్రై అళుత్తువుం, విష్ణు, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న ఇడం పొరుళ్ ఎవల్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఆ వరుసలో వస్తున్న మరో చిత్రం వన్మం. విజయ్ సేతుపతి, కృష్ణలు నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో సునైనా, హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర దర్శకుడు జైకృష్ణతో చిట్‌చాట్. చిత్ర టైటిల్ గురించి కాస్త వివరిస్తారా? వన్మం అంటే ప్రతీకారేచ్ఛ అని అర్థం. ఒక వ్యక్తి పగ, ప్రతీకారాలే చిత్ర కథ. పగ అనేది ప్రతి వ్యక్తిలోను ఏదో ఒక మూల దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది మనకు తెలియకుండానే బయటకు వస్తుంది. పోతుంది. అలాంటి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రమే వన్మం. అయితే అది మాత్రమే చిత్ర కథ కాదు. ఇంకా ఎలాంటి విషయాలుంటాయి? మాటలు గొంతు దాటనంత వరకే మర్యాద ఉంటుంది. వాటిని బయటకు అనేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎలాంటి కోపంలోనైనా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక్కమాట తూలినా సమస్యలు చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. దేశంలో పలు సమస్యలు ఇలాంటి వ్యాఖ్యల వలనే తలెత్తుతున్నాయి. అలాంటి ఒక వ్యాఖ్య చిత్రంలోని పాత్రల్ని ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లిందన్నది వన్మం చిత్రం. చిత్రంలో విజయ్‌సేతుపతి, కృష్ణలు స్నేహితులా? చిత్రంలోనే కాదు నిజ జీవితంలోనూ స్నేహితులే. ఈ చిత్రానికి వారిద్దరి సహకారం అపారం. ఉద్యోగవేటలో ఉండే కృష్ణ, ఆజన్మ ధనవంతుడైన విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. నటి సునైన ఎవరికి జంటగా నటిస్తున్నారు? ప్రస్తుతానికి ఆ ఒక్కటి అడగకండి. చిత్రం చూసి సునైన ఎవరికి జోడి అన్నది తెలుసుకోండి. సునైన చాలా గ్లామరస్‌గా నటించారట? అలాంటిదేమి లేదు. కాకపోతే కొలనులో స్నానమాడే సన్నివేశం చిత్రంలో చోటు చేసుకుంటుంది. అది అంత గ్లామరస్‌గా ఉండదు. అయితే చిత్ర కథకు ఏమేమి అవసరమో అన్నీ వుంటాయి. చిత్ర షూటింగ్ మొత్తం నాగర్కోవిల్లోనే నిర్వహించారట? అవును. నా సొంత ఊరు నాగర్‌కోవిల్. కథకు ఆ ప్రాంతాన్నే నేపథ్యంగా ఎంచుకున్నాను. నిర్మాత జెపక్కు కథ చెప్పగానే బాగుందన్నారు. ఇప్పటి వరకు తెరపై చూడని లొకేషన్స్, నాగర్‌కోవిల్‌లో వున్నాయి. దీంతో షూటింగ్ మొత్తం నాగర్‌కోవిల్, కన్యాకుమారి ప్రాంతాల్లో పూర్తి చేశాం. -
‘వన్నం’లో కృష్ణతో సునైనా రొమాన్స్
సునైనా పేరుకు తగ్గట్టుగానే కుట్టి అభినేత్రి ఈ బ్యూటీ. కాదలిల్ విళుందేన్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో మెరిసిన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఈ అమ్మడు. ఆ తరువాత వంశం, నీర్పరవై తదితర చిత్రాలలో హీరోయిన్గా మెప్పించిన సునైనా తగినన్ని అవకాశాలు, రావలసినంత పేరు రాలేదు. అయితే హీరోయిన్గా కోలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీకి ఒక అవకాశం వచ్చింది. యువ నటులు విజయ్ సేతుపతి, కృష్ణల కాంబినేషన్లో వన్నం అనే చిత్రం తెరకెక్కుతోంది. నెమిచంద్ జెపక్ పతాకంపై వి.హిందేష్ జెపక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న ఇద్దరు యువకుల మధ్య స్నేహం, పగ, ప్రతీకారాల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రంలో కృష్ణ సరసన హీరోయిన్గా సునైనాను ఎంపిక చేసినట్లు చెప్పారు. విజయ్ సేతుపతికి జోడి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అన్నారు. చిత్ర షూటింగ్ నాగర్‌కోవిల్ ప్రాంతంలో జరుపుతున్నట్లు దర్శకుడు తెలిపారు.


