‘వన్నం’లో కృష్ణతో సునైనా రొమాన్స్ | Sunaina romance with krishna in vannam | Sakshi
Sakshi News home page

‘వన్నం’లో కృష్ణతో సునైనా రొమాన్స్

May 12 2014 11:13 PM | Updated on Sep 2 2017 7:16 AM

‘వన్నం’లో కృష్ణతో సునైనా రొమాన్స్

‘వన్నం’లో కృష్ణతో సునైనా రొమాన్స్

సునైనా పేరుకు తగ్గట్టుగానే కుట్టి అభినేత్రి ఈ బ్యూటీ. కాదలిల్ విళుందేన్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో మెరిసిన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఈ అమ్మడు.

సునైనా పేరుకు తగ్గట్టుగానే కుట్టి అభినేత్రి ఈ బ్యూటీ. కాదలిల్ విళుందేన్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో మెరిసిన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఈ అమ్మడు. ఆ తరువాత వంశం, నీర్‌పరవై తదితర చిత్రాలలో హీరోయిన్‌గా మెప్పించిన సునైనా తగినన్ని అవకాశాలు, రావలసినంత పేరు రాలేదు. అయితే హీరోయిన్‌గా కోలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీకి ఒక అవకాశం వచ్చింది. యువ నటులు విజయ్ సేతుపతి, కృష్ణల కాంబినేషన్‌లో వన్నం అనే చిత్రం తెరకెక్కుతోంది. నెమిచంద్ జెపక్ పతాకంపై వి.హిందేష్ జెపక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న ఇద్దరు యువకుల మధ్య స్నేహం, పగ, ప్రతీకారాల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రంలో కృష్ణ సరసన హీరోయిన్‌గా సునైనాను ఎంపిక చేసినట్లు చెప్పారు. విజయ్ సేతుపతికి జోడి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అన్నారు. చిత్ర షూటింగ్ నాగర్‌కోవిల్ ప్రాంతంలో జరుపుతున్నట్లు దర్శకుడు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement