ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. మాస్ యాక్షన్‌లో సమంత | Samantha Maa Inti Bangaram Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaaram Trailer: ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. మాస్ యాక్షన్‌లో సమంత

May 25 2026 11:40 PM | Updated on May 26 2026 12:04 AM

Samantha Maa Inti Bangaram Movie Trailer Released

సమంత లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సమంత భర్త రాజ్ నిడిమోరు క్రియేట్ చేశారు. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత పెద్దగా మాట్లాడలేదు. తన టీమ్‌కి ఎక్కువ అవకాశమిచ్చింది. తాను మాట్లాడిన కొన్ని మాటలు కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడింది. ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందనకు ధన్యవాదాలు తెలిపింది. అనంతరం తన భర్త రాజ్ గురించి మాట్లాడుతూ 'రాజ్‌తో ఇప్పటివరకు ఎలాంటి వాదన జరగలేదు. ఆయన చాలా పర్‌ఫెక్ట్‌' అని ప్రశంసించింది.  

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి హీరోయిన్ చేసే పోరాటం, సాహసాలు ప్రధానంగా చూపించారు. సమంతకు ప్రత్యేకమైన బ్యాక్‌స్టోరీ కూడా జోడించారు. యాక్షన్ సీన్స్‌లో సమంత తన స్టంట్స్‌తో ఆకట్టుకుంది. 'ఒక్కొక్కర్ని కొడతాను చూడు.. ప్రేమతో అబ్బా' అనే డైలాగ్ ట్రైలర్‌లో బాగా పేలింది.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలం ఇచ్చింది. ట్రైలర్ ద్వారా సినిమా కథ ఎలా ఉంటుందో దాదాపుగా స్పష్టమైంది. ఇక మిగిలిన ఆసక్తికరమైన మలుపులు వెండితెరపై చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement