నటి సమంత. ఈ పేరే ఒక సంచలనం. కథానాయకిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా, అగ్ర కథానాయికిగా రాణిస్తుంది మాత్రం టాలీవుడ్ లోనే. అక్కడ స్టార్ హీరోలందరితోనూ జత కట్టేశారనే చెప్పాలి. కాగా వెబ్ సిరీస్ ద్వారా ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం అయిన సమంత ఇటీవల నిర్మాతగానూ అవతారమెత్తారు. తొలి ప్రయత్నంగా శుభం అనే చిత్రాన్ని నిర్మించారు. మలి ప్రయత్నంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై తన భర్త రాజ్ నిడిమోరు తో కలిసి నిర్మించి, నాయకిగా నటించిన చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలోనూ ఎంగళ్ తంగం పేరుతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సామ్ తన చిత్ర టీమ్ తో చెన్నైలో సందడి చేశారు. ఈ సందర్భంగా నటి సమంత మాట్లాడుతూ ‘‘చెన్నై తనకు ఎప్పుడూ ప్రత్యేకమే. సత్యం ధియేటర్, ఈ పక్కనే నేను చదివిన కళాశాల ఇవన్నీ మంచి మెమోరీస్. తమిళంలో మరిన్ని చిత్రాలు చేసి ఉండాల్సింది. అయినా ఇంకా చాలా కాలం ఉంది. తమిళంలో మంచి కథా చిత్రాల కోసం ఎదురు చూస్తున్నాను.
ఇక ఎంగళ్ తంగం చిత్రం విషయానికి వేస్తే చిత్రాన్ని నిర్మించడం, విడుదల చేయడంలో నిర్మాతల కష్టం తెలీసి వచ్చింది. అయినా మంచి చిత్రం చేశారనే సంతోషం కలిగింది. ఇది యాక్షన్ తో కూడిన అనుబంధాలు మేళవించిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో ప్రేక్షకులను అలరిస్తాయి.
ఎలాంటి కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారని అడుగుతున్నారని, అయితే మంచి జనరంజకమైన కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు పాటలు సన్నివేశాల్లో నటించడం కంటే యాక్షన్ సన్నివేశాల్లో నటించడమే ఈజీగా ఉందని అన్నారు. ఎంగళ్ తంగం చిత్రం బాగా వచ్చిందని సమంత చెప్పారు. కాగా ఈమె పనిలో పనిగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో దిగిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


