విద్యార్థులకు కావాల్సింది క్షమాభిక్ష కాదు మోదీజీ: రాహుల్‌ | Rahul Gandhi says students deserved his apology not forgiveness | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు కావాల్సింది క్షమాభిక్ష కాదు మోదీజీ: రాహుల్‌

Aug 1 2026 5:56 PM | Updated on Aug 1 2026 6:10 PM

 Rahul Gandhi says students deserved his apology not forgiveness

చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష కాదు, క్షమాపణ చెప్పాలని అన్నారు.

"భారత్ విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష అవసరం లేదు. వారికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది" అని రాహుల్‌ చెప్పారు. విద్యార్థులు తనపై చేసిన వ్యాఖ్యలను "క్షమిస్తున్నాను" అన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాహుల్ ఇలా అన్నారు.

నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను రాహుల్ కలుసుకుని ఓదార్చారు. ఈ భేటీ చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరిగింది. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు దుఃఖంలో ఉండటాన్ని చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని రాహుల్ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి యువకుడు, యువతి వెనుక జీవితాంతం బాధ మోసే కుటుంబం ఉంటుందని చెప్పారు.

పలుసార్లు ప్రశ్నపత్రాల లీకులు జరగడం, పరీక్షలు రద్దు కావడం, ఎన్నో సంవత్సరాల సన్నాహాలు ఒక్క రాత్రిలో వృథా కావడం విద్యా వ్యవస్థలోని వైఫల్యాన్ని బయటపెట్టాయని అన్నారు. నిజాయితీగా లేని వ్యవస్థలో విద్యార్థులు నిజాయితీగా శ్రమించాలని అడుగుతున్నారని చెప్పారు.

ప్రశ్నపత్రం లీక్ కారణంగా భవిష్యత్తు కోల్పోయిన ఒక్క విద్యార్థినైనా, దుఃఖంలో ఉన్న ఒక్క తల్లిదండ్రినైనా ప్రధాన మంత్రి కలవలేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న వేదనను కేంద్ర ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement