రూ. 50 కోట్ల క్లబ్బులోకి ‘మా ఇంటి బంగారం’ | Maa Inti Bangaram Movie Box Office Collection Day 4 | Sakshi
Sakshi News home page

రూ. 50 కోట్ల క్లబ్బులోకి ‘మా ఇంటి బంగారం’

Jun 23 2026 1:03 PM | Updated on Jun 23 2026 1:09 PM

Maa Inti Bangaram Movie Box Office Collection Day 4

బాక్సాఫీస్‌ వద్ద ‘మా ఇంటి బంగారం’ రికార్డులు సృష్టిస్తోంది.  దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత సమంత నటించిన చిత్రమిది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సమంత భర్త రాజ్‌ నిడిమోరు కథ, కథనం అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. భారీ అంచనాలతో ఈ నెల 19న విడుదలైన ఈ మూవీ తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ సంపాదించుకుంది. రెండో రోజు నుంచి నెమ్మదిగా పుంజుకొని వీకెండ్‌లో భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్‌, ముఖ్యంగా మహిళలు ఈ చిత్రంపై ఆసక్తిని కనబరుస్తున్నారు.

తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 13 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక కేవలం నాలుగు రోజుల్లోనే హాఫ్‌ సెంచరీ(రూ.50 కోట్లు) కొట్టి రికార్డు క్రియేట్‌ చేసింది. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్ల వసూలు వచ్చినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి రూ. 30 కోట్ల బడ్జెట్‌ అయినట్లు సమచారం. ఇప్పటికే ఓటీటీ, శాటిలైట్స్‌, ఆడియో రైట్స్‌ రూపంలో రూ. 35 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక థియేటర్స్‌లోనూ భారీ కలెక్షన్స్‌ రాబడుతోంది. మొత్తంగా గ్యాప్‌ తీసుకొని వచ్చిన సమంతకు ‘మా ఇంటి బంగారం’తో భారీ బ్లాక్‌ బస్టర్‌ దక్కింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement