అప్పుడు మా ఇంట్లోవాళ్లే నన్ను ట్రోల్‌ చేశారు: సమంత | Samantha Interesting Comments On Her Temple | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో మా ఇంట్లోవాళ్లే నన్ను ట్రోల్‌ చేశారు: సమంత

Jun 15 2026 12:02 PM | Updated on Jun 15 2026 12:48 PM

Samantha Interesting Comments On Her Temple

సమంత.. వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు నిర్మాతగాను రాణిస్తోంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తూ నిర్మించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సమంత. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను కూడా పంచుకుంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోసం ఓ అభిమాని గుడి కట్టిన విషయం తెలిసిన తర్వాత ఏం జరిగిందో వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌ని బాపట్లకు చెందిన ఓ వీరాభిమాని సమంత కోసం 2023లో ఓ గుడి కట్టిన విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే గుడి కట్టారనే విషయం తెలిసి తాను కూడా షాకయ్యానంటోంది సమంత.

‘గుడి కట్టించుకునేంత అర్హత నాకు లేదు. నేనేం స్పెషల్‌ కాదు. ఇంతమంది అభిమానుల ప్రేమను పొందే అదృష్టం ఆ దేవుడు నాకిచ్చాడు. అంతేకాని నేను అంత గొప్పదాన్ని ఏం కాదు. ఇలా గుడి కట్టడం కూడా నాకు నచ్చదు. అయితే ఆ అభిమానితో నేను మాట్లాడాను. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఆయన ఆ గుడి కట్టి పూజలు చేశాడట. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడట. ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యా. అయితే గుడి కట్టిన విసఁం తెలిసిన తర్వాత మాత్రం మా ఇంట్లోవాళ్లు, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. నీకోసం గుడి కట్టారట అంటూ ఇంట్లో వాళ్లే ట్రోల్‌ చేశారు(నవ్వుతూ..)’ అని సమంత చెప్పుకొచ్చింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement