సమంత తన భర్తని ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? | Samantha Reveals Pregnancy And Shares What She Calls Husband Raj In Maa Inti Bangaram Success Meet, Deets Inside | Sakshi
Sakshi News home page

సమంత తన భర్తని ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?

Jun 25 2026 10:12 AM | Updated on Jun 25 2026 11:33 AM

Do You Know Nick Name Of Samantha Husband Raj nidimoru

సమంత తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతోంది. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా..వీకెండ్‌లో పుంజుకొని, నాలుగు రోజుల్లోనే రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత సామ్‌ నటించి చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆమె అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక వారి ఆనందాన్ని రెట్టింపు చేసే గుడ్‌ న్యూస్‌ చెప్పింది సమంత. తాను ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. బుధవారం నిర్వహించిన మా ఇంటి బంగారం సక్సెస్‌ మీట్‌లో ఆమె ఈ విషయాన్ని చెప్పింది. ఇదే ఈవెంట్‌లో తన భర్తను ముద్దుగా ఏమని పిలుస్తుందో కూడా ఆమె చెప్పింది.

మా ఇంటి బంగారం చిత్రంలో సమంత తన భర్త అనిరుధ్‌ని ముద్దుగా హనీ అని పిలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజ నీజ జీవితంలో భర్త అయిన రాజ్‌ని ప్రేమగా ఏమని పిలుస్తారు అని సక్సెస్‌ మీట్‌లో సమంతను అడిగింది యాంకర్‌. దానికి సమంత సిగ్గు పడుతూ సమాధానం చెప్పింది.  ‘రాజ్‌ని ఇంట్లో వాళ్ల అమ్మ, చెల్లి ప్రేమగా బాబు అని పిలుస్తారు. నేను కూడా  అలానే పిలుస్తాను అని నవ్వుతూ చెప్పింది.  ప్రస్తుతం ఈ వీడియో క్లిప్పు నెట్టింట వైరల్‌ అవుతోంది. 

కాగా, 2025లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు. ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్‌ చేస్తున్న సమయంలోనే రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి..పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement