శ్రీముఖి నీ పెళ్లెప్పుడు?.. యాంకర్ ఫుల్ క్లారిటీ..! | Sreemukhi Opens Up About Her Marriage Plans At Samantha Maa Inti Bangaram Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

Sreemukhi: 'నా పెళ్లి అప్పుడే '.. శ్రీముఖి ఆసక్తికర కామెంట్స్

Jun 17 2026 8:13 AM | Updated on Jun 17 2026 9:10 AM

Tollywood acnhor Sreemukhi comments about Her marriage

టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో వస్తోన్న మా ఇంటి బంగారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తళుక్కున మెరిసింది. పట్టుచీరలో కనిపించి తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌కు హాజరైన శ్రీముఖిని మరో స్టార్ యాంకర్ సుమ తన ప్రశ్నలతో చిక్కుల్లో పడేసింది.

మామూలుగా బంగారం ఎప్పుడు కొంటారని శ్రీముఖిని సుమ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ పెళ్లిళ్ల సమయంలో బంగారం ఎక్కువగా కొంటారని చెప్పింది. మరి నీ పెళ్లెప్పుడు అంటూ సుమ మరో ప్రశ్న వేసింది. దీనికి శ్రీముఖి సరదాగా సమాధానం ఇచ్చింది. సమంతను చూపిస్తూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.  

ఈ సినిమా ప్రారంభమైనప్పుడు సమంత పెళ్లి జరిగింది. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజై పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యాక నా పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నా అని నవ్వుతూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. దీంతో శ్రీముఖి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సమంత నటించిన 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీముఖ కీలక పాత్ర పోషించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement