'ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నా'.. సమంత భర్త ఆసక్తికర కామెంట్స్ | Samantha husband Raj Nidimoru comments about maa inti Bangaram | Sakshi
Sakshi News home page

Samantha: ' ఫస్ట్ టైమ్ ఇలా చూస్తున్నా'.. సమంత భర్త ఆసక్తికర కామెంట్స్

Jun 16 2026 7:10 AM | Updated on Jun 16 2026 7:10 AM

Samantha husband Raj Nidimoru comments about maa inti Bangaram

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సామ్ తన సొంత బ్యానర్‌లో నిర్మించారు. ఇ‍ప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ సినిమాలో సమంత గృహిణి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్‌ చేసిన టీజర్‌లో యాక్షన్ సన్నివేశాల్లోనూ సామ్ నటన ఆకట్టుకుంది.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సామ్ భర్త రాజ్ నిడిమోరు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ నిడిమోరు ఆసక్తికర కామెంట్స్ చేశారు. హిందీలో చాలా సినిమాలు చేశానని.. కానీ ఈ మూవీకి వస్తున్నంత రెస్పాన్స్‌ ఎక్కడా చూడలేదన్నారు. తిరుపతి నుంచి నాకు ఫోటోలు వస్తున్నాయి.. మా అమ్మ కాలేజీ దగ్గర హోర్డింగ్స్ పెట్టారని తెలిసింది. నేను ఫస్ట్ టైం ఇంత హడావిడి చూస్తున్నానని రాజ్ నిడిమోరు ఆనందం వ్యక్తం చేశారు. 
.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement