సమంత ఉగాది పచ్చడి .. భర్త రాజ్‌ షాకింగ్ కామెంట్..! | Tollywood actress Samantha Ugadhi Special Pachadi Video goes Viral | Sakshi
Sakshi News home page

Samantha: భర్తను అలా పిలిచిన సమంత.. షాకైన యాంకర్ సుమ..!

Mar 19 2026 3:38 PM | Updated on Mar 19 2026 5:31 PM

Tollywood actress Samantha Ugadhi Special Pachadi Video goes Viral

టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఆమె పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌ జరిగింది. పవిత్రమైన భూతశుద్ధి పేరుతో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వివాహానికి కొద్దిమంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

అయితే ఇవాళ ఉగాది కావడంతో సామ్ సైతం పండుగను సెలబ్రేట్ చేసుకుంది. యాంకర్ సుమ, డైరెక్టర్‌ నందిని రెడ్డితో కలిసి ఉగాది పచ్చడి చేసింది. ఈ సందర్భంగా తన భర్త రాజ్ నిడిమోరుకు లైవ్‌లో ఫోన్ చేసి మాట్లాడింది. ఉగాది పచ్చడి చేశానంటూ తన భర్తకు చెప్పింది. నువ్వు చేశావా? అంటూ రాజ్‌ ‍అనడంతో పక్కనే ఉన్న సుమ, నందిని నవ్వు ఆపుకోలేపోయారు. అంతకుముందు సామ్.. హాయ్‌ బాబు అని రాజ్‌ను ముద్దుపేరుతో పిలవడంతో యాంకర్ సుమ ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

Viral Video: ఉగాది పచ్చడి చేసిన సమంత..

కాగా.. వీరిద్దరు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ‍ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట గతేడాది డిసెంబర్ 1న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంలో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మే 15న థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement