సమంత లీడ్ రోల్‌లో వచ్చిన మా ఇంటి బంగారం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఊహించని విజయాన్ని సాధించింది. ఈ హిట్‌తో పాటు సమంత అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి డబుల్ ఆనందాన్నిచ్చింది.
అయితే తాజాగా మా ఇంటి బంగారం మూవీ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం సామ్ ఎంతలా కష్టపడిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ కోసం సామ్ కష్టపడిన తీరు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సీన్స్‌లో సమంత గన్ తిప్పిన విధానం హైలెట్‌గా అనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మా ఇంటి బంగారం కష్టాన్ని మీరు కూడా చూసేయండి.


