సమంతకు వింత పోటీ.. నో రిలీజ్‌, ఓన్లీ రీరిలీజ్‌! | Samantha's Maa Inti Bangaram Vs 6 Re-Release Movies | Sakshi
Sakshi News home page

సమంతకు వింత పోటీ.. పాత సినిమాలతోనే బాక్సాఫీస్‌ ఫైట్‌!

Jun 25 2026 12:45 PM | Updated on Jun 25 2026 1:30 PM

Samantha's Maa Inti Bangaram Vs 6 Re-Release Movies

టాలీవుడ్‌లో సినిమాల మధ్య పోటీ ఎక్కువ. పెద్ద సినిమాలు బరిలో లేకుంటే వారానికి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. థియేటర్స్‌లో బాగా ఆడుతున్న సినిమాకు సైతం రెండో వారం పోటీ తప్పదు. ఏమున్నా వారంలోపే బాక్సాఫీస్‌ లెక్కలు చూసుకోవాలి. కొన్ని సినిమాలకు మాత్రమే రెండో వారం దొరుకుతుంది. ఆ అదృష్టం సమంత  కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’కు దక్కింది. 

ఈ నెల 19న విడుదలై, బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఈ చిత్రానికి పోటీగా రెండో వారం ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కావడం లేదు. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్‌. సమంతకు పోటీగా కొత్త సినిమాలు లేవు కానీ, ఆరు పాత సినిమాలు మళ్లీ థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతున్నాయి. 

మహేశ్‌ బాబు హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ ఒక్కడు ఈ నెల 26న  రీరిలీజ్‌ అవుతుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 4కే వెర్షన్‌లో ఈ సినిమా విడుదల కానుంది. 

మరోవైపు మంచు విష్ణు కన్నప్ప కూడా ఈ వారం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సినిమా రిలీజ్ అయి ఏడాది అవుతున్న సందర్భంగా మళ్లీ జూన్ 27న ‘కన్నప్ప’ని లిమిటెడ్ స్క్రీన్‌లలో రిలీజ్ చేయబోతోన్నారు.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన సినిమా ‘హను మాన్‌’ త్రీడీ వెర్షన్‌ని నేడు(జూన్‌ 25) రిలీజ్‌ చేశారు. వీటితో పాటు రాజ్‌ తరుణ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా చూపిస్త మావ, గబ్బర్‌ సింగ్‌, వెల్కమ్‌ టు ది జంగిల్‌(హిందీ) చిత్రాలు కూడా ఈ నెల 27న రీరిలీజ్‌ కాబోతున్నాయి. ఇలా సమంతకు రిలీజ్‌తో కాకుండా రీరిలీజ్‌ సినిమాలతో పోటీ ఎదురైంది. అయితే వీటి ప్రభావం ‘మా ఇంటి బంగారం’పై పెద్దగా ఉండకపోవచ్చు. ఈ మధ్య రీరిలీజ్‌ చిత్రాలకు సైతం ఆదరణ తగ్గిపోయింది.  డై హార్ట్‌ ఫ్యాన్స్‌ తప్పితే సామాన్యులు రీరిలీజులకు వెళ్లడం లేదు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement