సమంత-నయనతార.. ఇంట్రెస్టింగ్ బాండింగ్ | Nayanthara Congratulates And Praises Samantha On Success Of Maa Inti Bangaram Movie, Fans Celebrate Their Bond | Sakshi
Sakshi News home page

Samantha: బంగారాన్ని ఆకాశానికెత్తేసిన నయన్

Jun 23 2026 9:11 AM | Updated on Jun 23 2026 10:45 AM

Nayanthara Praises Samantha Maa Inti Bangaram Movie

స్టార్‌ హీరోయిన్ల మధ్య ఈగోనే తొంగి చూస్తుంది కానీ సఖ్యత, స్నేహం ఉండటం అరుదు. ఇటీవల కాలంలో ఆ మార్పు వచ్చిందనే చెప్పొచ్చు. అందుకు ఉదాహరణ సమంత, నయనతారలే. వీరిద్దరూ స్టార్‌ హీరోయిన్లే. ఇద్దరు నిర్మాతలే. అత్యంత భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు నటి నయనతార. ఇంతకు ముందు తమిళం, తెలుగు భాషల్లో స్టార్‌ హీరోలతో జోడీ కట్టిన నటి సమంత. కాగా సమంత లీడ్ రోల్ చేసి, నిర్మించిన సినిమా 'మా ఇంటి బంగారం'. నందిని రెడ్డి దర్శకురాలు. తమిళంలోనూ 'ఎంగల్‌ తంగం' పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్ర విజయాన్ని పురస్కరించుకుని నయనతార.. సమంతని అభినందనలతో ముంచెత్తింది.

నయన్ తన ఇన్‌ స్ట్రాలో.. 'నీ కారణంగా నేను చాలా సంతోషపడుతున్నా సామ్‌. అభిమానానికి, విజయానికి నువ్వు అన్ని విధాలుగా పూర్తిగా అర్హురాలివి. మా ఇంటి బంగారం చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు' అని రాసుకొచ్చింది. కాగా ఇంతకు ముందు నయనతార సొంతంగా నిర్మించి, నటించిన 'కాత్తువాక్కుల రెండు కాదల్‌' మూవీలో సమంత మరో హీరోయిన్‌గా చేసింది. సమంత త్వరలో 'రక్త బ్రహ్మాండ' పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ చేయాలి. అయితే ఇది జరుగుతుందా లేదా అనేది ఇప్పటికైతే అప్డేట్ లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement