జైలర్‌ ఇంట్లో హృతిక్‌ | Hrithik Roshan recently met Rajinikanth at his house | Sakshi
Sakshi News home page

జైలర్‌ ఇంట్లో హృతిక్‌

Jul 13 2026 12:36 AM | Updated on Jul 13 2026 12:36 AM

Hrithik Roshan recently met Rajinikanth at his house

రజనీకాంత్, హృతిక్‌రోషన్  కలిసి స్క్రీన్  షేర్‌ చేసుకున్నారు. రజనీకాంత్‌ హీరోగా నెల్సన్  దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జైలర్‌ 2’. రమ్యకృష్ణ, ఎస్‌జే సూర్య, విజయ్‌ సేతుపతి, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మోహన్  లాల్, శివరాజ్‌ కుమార్, హృతిక్‌ రోషన్  గెస్ట్‌ రోల్స్‌ చేశారు. రజనీకాంత్‌–హృతిక్‌ రోషన్  మధ్య వచ్చే సన్నివేశాలను జూన్‌ నెల చివర్లో చెన్నైలో చిత్రీకరించారు.

ఆ సమయంలో రజనీకాంత్‌ ఇంటికి మర్యాద పూర్వకంగా వెళ్లారు హృతిక్‌ రోషన్ . ఈ ఫొటోలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ‘జైలర్‌ 2’లో జైలర్‌ ముత్తువేల్‌ పాండియన్ గా నటించారు రజనీకాంత్‌. 

కథ రీత్యా హృతిక్‌ రోషన్  కూడా ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారని తెలిసింది. సన్ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్  నిర్మించిన ‘జైలర్‌ 2’ అక్టోబరు 15న రిలీజ్‌ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. 1986లో రిలీజైన హిందీ చిత్రం ‘భగవాన్  దాదా’లో రజనీకాంత్‌ –హృతిక్‌ రోషన్  కలిసి నటించారు. ఆ సమయంలో హృతిక్‌ రోషన్  బాలనటుడు. హృతిక్‌ రోషన్  తండ్రి, దర్శక–నిర్మాత రాకేష్‌ రోషన్  ఈ సినిమాను నిర్మించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement